Home » TSRTC
వచ్చే రెండేళ్లలో హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న 3వేల డీజిల్ ఆర్టీసీ బస్సులను నగరం నుంచి బయటకు, ఓఆర్ఆర్ ఆవలకు తరలిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
తెలంగాణలో మరో రెండు కొత్త ఆర్టీసీ బస్ డిపోలను ఏర్పాటు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. పది పదిహేనేళ్లుగా పలు కారణాలతో నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ కొత్త డిపోల ఏర్పాటుపై దృష్టి పెట్టలేకపోయిందన్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కల్పిస్తున్న ఉచితబస్ ప్రయాణం అమలు కోసం కండక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుని గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి టూర్ ప్యాకేజీ కింద ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ అధికారులు బుధవారం తెలిపారు.
కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని టీజీఎ్సఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రధానంగా శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర ఆలయాలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని తెలిపారు.
సుదీర్ఘకాలంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీఎస్ ఆర్టీసీఎ్సడబ్ల్యూయూ(ఐఎన్టీయూసీ) ప్రతినిధి బృందం బుధవారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించింది.
ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునే ప్రణాళికలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎ్సఆర్టీసీ) వినియోగ దారుల ఇళ్ల వద్దకే లాజిస్టిక్స్ (కార్గో) సేవలను విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఆర్టీసీ కండక్టర్గా ఉద్యోగం చేయడం ఇష్టం లేక విధుల్లో చేరిన 20రోజులకే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం జీఎడవల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
బతుకమ్మ, దసరా(Bathukamma, Dussehra) పండుగలకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ చార్జీల షాక్ ఇచ్చింది. పండుగ సందర్భంగా నడుపుతున్న స్పెషల్ బస్సుల్లో అదనంగా 25 శాతం చార్జీలు పెంచింది. నగరం నుంచి తెలంగాణ, ఏపీలోని జిల్లాలకు వెళ్లే స్పెషల్ సర్వీసులకు ఈ చార్జీలు వర్తిస్తాయని పేర్కొంది.
Telangana: హైదరాబాద్ శివారు నుంచి దసరాకు స్పెషల్ బస్ సర్వీసులు నడుస్తాయని టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరుకు సర్వీసులను సిద్ధం చేశామన్నారు. కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.