Home » TTD
తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్న విషయం తెలిసిందే. అక్కడ శ్రీవారి సేవకు సంబంధించిన టోకెన్లు జారీ చేస్తారు. అయితే ఈ టోకెన్ల జారీలో తాజాగా భారీ మోసం వెలుగు చూసింది. వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని..రూ.300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి టిక్కెట్లు కొనుగోలు చేశామని చెబుతూ దళారులు శ్రీవారి భక్తులను బురిడీ కొట్టించారు.
Tirumala Temple: తిరుమల శ్రీవారం ఆలయం గోపురంపై నుంచి మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. ఆగమ నిబంధనలకు విరుద్ధంగా నిత్యం శ్రీవారి ఆలయం పై విమానాలు వెళ్తుండడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీవారి భక్తులకు అభిషేక దర్శనాలు కల్పిస్తామని కోట్ల రూపాయలు వసూలు చేసిన దళారి రమణ ప్రసాద్పై నాలుగు రాష్ర్టాలలో కేసులు వున్నట్లు సమాచారం. తిరుమలలోనే పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. తనికోసం రెండు నెలలుగా గాలిస్తున్న వన్ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
స్వామి సేవలో ఎలాంటి లోటుపాట్లు కలిగినా సహించలేను. అలాంటిది స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపేందుకు నేను సహకరిస్తానా? ఆరోపణలు చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి’’
హిందువులున్న ప్రతి దేశంలోనూ శ్రీవారి ఆలయం ఉండాలని ఆశిస్తున్నాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రయాగరాజ్లో మహాకుంభమేళా జరుగుతున్న తరుణంలోనే తిరుపతిలో
టీటీడీలో ఇదివరకు కీలకంగా వ్యవహరించిన ఇద్దరిపై లుకౌట్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది.
ఇటు పక్క తిరుమల(Tirumala)లోని ఆనంద నిలయం, వేంకటేశ్వరస్వామి ఫొటో, అటువైపు జగన్(Jagan) బొమ్మ చుట్టూ నవరత్నాల పేరుతో అందిస్తున్న పథకాలను ముద్రించారు. ఇదీ గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్ కాపీలోని చిత్రాలు. ఇలా, శ్రీవారితో సమానంగా అప్పటి సీఎం జగన్ ఫొటో ముద్రించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
Fast Tag: తిరుమల అలిపిరి టోల్ గేట్ వద్ద వెంకన్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా టోల్గేట్ వద్ద ఫాస్ట్ ట్యాగ్ సిస్టం పనిచేయడం లేదు. దీంతో నగదు రూపంలో టోల్ ఫీజు చెల్లింపులకు అక్కడి సిబ్బంది నిరాకరిస్తున్నారు.
తిరుమల(Tirumala)లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు రూ.40 కోట్లతో ఔటర్రింగు రోడ్డు నుంచి పాపవినాశనంకు నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి టీటీడీ(TTD) పూనుకుంది.
టీటీడీ ఉచితంగా కేటాయించే శ్రీవారి సేవను ఓ దళారీ అధిక ధరకు మహిళలకు విక్రయించి మోసం చేసిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది.