Home » TTD
తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ఈ ఉదయం వరాహ పుష్కరిణిలో స్వామివారి చక్రస్నాన మహోత్సవం వేడుకగా ప్రారంభమైంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి అర్చకులు స్నప్న తిరుమంజనాని నిర్వహించనున్నారు.
తిరుపతి అభివృద్ధికి టీటీడీ వార్షిక బడ్జెట్లో ఒక శాతం కేటాయింపునకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలపలేదు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సలకు మూడు అంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి (Tirupati SP Parameswara Reddy) తెలిపారు.
విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మకు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు సోమవారం పట్టువస్త్రాలు సమర్పించారు.
2024 జనవరి మాసం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను అక్టోబర్ 18న ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీడిప్ కోసం అక్టోబర్ 18వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. 22న 10 గంటలకు లక్కీ డిప్ల్లో సేవా టిక్కెట్లను టీటీడీ కేటాయించనుంది.
దేశంలో ఏ పుణ్యక్షేత్రంలోనూ ఆయా ఆలయాలకు వచ్చే సొమ్మును ఆలయాలున్న మున్సిపాలిటీలకు ఇస్తున్నారా? అని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ నెల 28వ తేదీన దుర్గమ్మ ఆలయాన్ని మూసివేయనున్నారు. పాక్షిక చంద్ర గ్రహణం సందర్భంగా ఈనెల 28వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. దీంతో శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి డైరెక్ట్ క్యూ లైన్ నుంచి భక్తులను పంపుతున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఈనెల 15 నుంచి 23 వరకు నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముద్రించిన 2024 ఏడాది డైరీలు, క్యాలెండర్లు నగరంలో అందుబాటులోకి వచ్చాయి.