Home » TTD
జగన్ దొంగలకు పెద్దన్నలా నిలిచారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకన్న స్వామితో పెట్టుకున్నారు కాబట్టే చిత్తుగా ఓడి 11 సీట్లకు పడిపోయారని వ్యాఖ్యలు చేశారు.
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి అప్రూవర్‌గా మారిపోయారు. ఈ వ్యవహారానికి సంబంధించి సీబీఐ సిట్‌కు ధర్మారెడ్డి కీలక సమాచారాన్ని అందజేశారు.
టీటీడీ చేపట్టిన వేదపారాయణ పోస్టుల ఇంటర్వ్యూల్లో తొలిరోజే వివాదం మొదలైంది. 700 పోస్టులకుగాను తిరుపతిలోని శ్వేతలో సోమవారం మొదలైన ఇంటర్వ్యూలు 16వ తేదీ వరకు జరగనున్నాయి.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. తన వివరాలను సిట్ బృందం అడగటంపై ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు సుబ్బారెడ్డి.
తిరుమలలో కొంతమంది ప్రజాప్రతినిధుల పీఆర్వోలు అధిక ధరలకు వీఐపీ బ్రేక్ దర్శనాలను అమ్ముకుంటున్నారని ఈశ్వర్(అనంతపురం) అనే భక్తుడు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌కు ఫిర్యాదు చేశారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో శుక్రవారం పలువురు భక్తులు ఈవోతో ఫోన్‌లో సంభాషించారు.
శ్రీవారి ఖజానాను దోచుకున్న కరుణాకర్ రెడ్డి అండ్ కోని కచ్చితంగా శిక్షిస్తారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. పరకామణి విషయంలో దొంగలను తీసుకెళ్లి లోకాయుక్తలో వారెలా రాజీ చేస్తారని ప్రశ్నించారు భానుప్రకాష్ రెడ్డి.
తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రతిష్ట పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం గతం కంటే చాలా బావుందని భక్తులు చెబుతున్నారని పేర్కొన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
తిరుపతి గరుడ వారధిపై ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ స్పష్టం చేశారు. తిరుపతిలో ప్రతి మలుపు వద్ద బ్లీకింగ్ లైట్లు, రేడియం ఏరో మార్క్స్, సేఫ్టీ మెజర్‌మెంట్స్ తీసుకున్నామని ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు.
వెంగమాంబ అన్నప్రసాద ట్రస్టుకు భక్తుల నుంచి ఆరు నెలల కాలంలో రూ. 180 కోట్లు విరాళంగా అందాయి. అంటే సగటున రోజుకు కోటి రూపాయలు ఈ ఒక్క ట్రస్టుకే భక్తులు సమర్పిస్తున్నారు. శ్రీనివాసుడి సమక్షంలో అన్నదానం అన్నది గొప్ప పుణ్యకార్యక్రమం కావడంతో విశేషంగా స్పందిస్తున్నారు.
టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.