Home » TTD
భగవద్గీతపై ఎమ్మెల్యే ఎమ్.ఎస్.రాజు వ్యాఖ్యలు అర్థరహితమని ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. భగవద్గీతతో ప్రయోజనం లేదన్న అతనికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుచూపుతో మొంథా తుఫాను నుంచి చాలా తక్కువ నష్టంతో బయటపడ్డామని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
టీటీడీ పాలక మండలి మంగళవారం తిరుమలలో సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలను టీటీడీ బోర్డ్ చైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు.
తిరుమల పరకామణిలో చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడంపై హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టమని తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. జగన్ హయాంలో కొంతమంది రాజకీయ నేతల అండదండలు చూసుకొని వేంకటేశ్వర స్వామివారి సొమ్ములు కాజేశారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
అలిపిరి కాలిబాటలోని ఎన్‌ఎస్ టెంపుల్ వద్ద సుమారు తొమ్మిది అడుగుల పొడవైన నాగుపాము శుక్రవారం ఓ దుకాణంలోకి ప్రవేశించింది. దీనిని గుర్తించిన స్థానికులు వెంటనే పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి భాస్కర్‌నాయుడికి సమాచారమిచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తిరుమల తిరుపతి దేవస్థాన(TTD) ఛైర్మన్ బి.ఆర్.నాయుడు భేటీ అయ్యారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో చేపట్టబోయే ఏర్పాట్లపై వారిద్దరూ చర్చించినట్టు సమాచారం.
టీటీడీ ట్రస్టులో కూడా బంజారాలకు అవకాశం కల్పించాలని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. హాథిరాంజీ బాబా మఠానికి చెందిన భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఈటల రాజేందర్ ఆరోపించారు.
లడ్డూ ధరల పెంపు వార్తలను టీటీడీ ఛైర్మన్ తీవ్రంగా ఖండించారు. కావాలనే కొన్ని ఛానళ్లు పని గట్టుకొని టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దక్షిణకన్నడ జిల్లా కేంద్రం మంగళూరులోనూ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించేందుకు ప్రభుత్వం భూమిని మంజూరు చేసిందని టీటీడీ బోర్డు సభ్యుడు నరే్‌షకుమార్ అన్నారు. బెంగళూరు వయ్యాలికావల్‌లోని టీటీడీ ఆలయంలో గురువారం 2026 ఏడాదికి సంబంధించిన క్యాలెండర్‌లు, డైరీలను ఆయన విడుదల చేశారు.