Home » Twitter
ప్రశ్నించడమే నేరమా.. నిలదీయడమే పాపమా.. అని బాల్క సుమన్ అన్నారు. లగచర్ల, దిలావర్ పూర్, రైతుకు బేడీలు, విద్యార్థుల మరణాలు, గురుకుల సంక్షోభాలు.. ఇలా వీటన్నింటిపై కేటీఆర్ నిలదీస్తున్నందుకే కుట్రాలా అంటూ ఆయన ప్నశించారు.
సీఎం రేవంత్ రెడ్డి తన ఎక్స్(ట్విటర్) ఖాతా డీపీ(డి్సప్లే పిక్చర్)ని గురువారం మార్చారు.
తెలంగాణ రైతన్నలు రుణం తీరక, కొత్త రుణాలు పుట్టక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇంత జరుగుతున్నా రైతు భరోసా మీద వేసిన మంత్రివర్గ ఉపసంఘంలో మాత్రం చలనం కలగడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రాయలసీమలోనూ కులవ్యవస్థ, అసమానతలపై చైతన్యం తీసుకొచ్చిన సామాజిక తత్వవేత్త గురు కనకదాస అని ఏపీ సీఎం చంద్రబాబు కీర్తించారు. బీసీలను, వారి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని ఏళ్ల కిందటే ఆయన చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టింగులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వానికి సూచించారు. వైఎస్ భారతీ పీఏ వర్రా రవీందర్ రెడ్డి పై తాను గతంలోనే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ ఫాం 'ఎక్స్'(గతంలో ట్విటర్)ను అణచివేయడానికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ బృందం కుట్ర పన్నుతోందా. అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో పాలన చేతకాకే కాంగ్రెస్ పార్టీ నేతలు పనికిమాలిన మాటలు, పాగల్ పనులు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఎద్దేవా చేశారు.
తెలుగు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. మంచిపై చెడు గెలిచిన సందర్భంగా దసరా పండగ నిర్వహించుకుంటారని మంత్రి లోకేశ్ తెలిపారు.
కొందరు మాత్రమే తమ అడుగుజాడలు వెళుతూ వెళుతూ ఈ భూమిపై వదిలి వెళతారని, తమ దూరదృష్టి, సమగ్రతలతో రతన్ టాటా అదే చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మనం కేవలం ఒక గొప్ప వ్యాపారవేత్తనే కాదు గొప్ప మానవతావాదిని కోల్పోయామని, కేవలం పారిశ్రామిక వారసత్వంలోనే కాకుండా ఆయన అందరి హృదయాలను స్పృశించి వెళ్ళారన్నారు.
కర్ణాటకలో ఐదు, తెలంగాణలో ఆరు గ్యారెంటీలంటూ అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్.. హరియాణలో ఏడు గ్యారెంటీలని మభ్యపెట్టే ప్రయత్నాన్ని ఆ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.