Home » Uddhav Thackeray
బ్యాగ్ తనిఖీకి ఈసీ అధికారులు రావడంతో థాకరే ప్రశ్నలు కురిపించడం వీడియోలో కనిపిస్తోంది. ముందు తమను తాము పరిచయం చేసుకోమని థాకరే వారిని అడగంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బ్యాగ్‌లు ఇలాగే చెక్ చేస్తారా? అంటూ అధికారులను ప్రశ్నించారు.
మహారాష్ట్రలో రెబల్స్ బెడద వల్ల ఓట్లు చీలి పార్టీల గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో మమహాయుతి, మహా వికాస్ అఘాడి కూటములు తెరవెనుక నామినేషన్ల ఉపసంహరణకు ప్రయత్నాలు సాగించాయి. కొందరు అసంతృప్తి నేతలు ఆయా పార్టీలకు రాజీనామా చేశారు.
ఎన్సీపీ, శివసేనలో చీలికల తర్వాత మొదటిసారి శాసనసభ ఎన్నికల్లో పోటీపడుతున్నారు. పార్టీ చీలికల తర్వాత మహారాష్ట్ర రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. శివసేనలోని ఒక వర్గానికి ఏక్నాథ్ షిండే నేతృత్వం వహిస్తుండగా, మరో వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం వహిస్తున్నారు. ఎన్సీపీ కూడా శరద్ పవార్, అజిత్ పవార్‌గా విడిపోయాయి. ఒకే పార్టీ రెండుగా చీలిపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో..
'ఇంపోర్ట్ మాల్' అంటూ సావంత్ మాట్లాడటంపై షైన ఎన్సీ అభ్యంతరం తెలిపారు. మహిళల గౌరవంపై జరుపుతున్న దాడిగా దీనిని పేర్కొన్నారు. శివసేన (యూబీటీ) నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశించారు. గతంలో సావంత్ తనను కూడా ప్రచారం కోసం తీసుకువెళ్లారని గుర్తుచేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'మహా వికాస్ అఘాడి' కూటమి పొత్తుల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతుండటంతో తాజాగా ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది.
శివసేన(యూబీటీ), ఎన్సీపీ (శరద్) పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో భాగస్వామ్యపక్షాలుగా ఉన్నాయి. నామినేషన్ల పర్వం మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే మూడు పార్టీలు చర్చలు ప్రారంభించాయి. మూడు పార్టీల నుంచి ముగ్గురు కీలక నేతలతో ఓ కమిటీని ఏర్పాటుచేసి, సీట్ల పంపకంపై చర్చించారు. 200కు పైగా సీట్లలో ఏకాభిప్రాయం వచ్చిందని ఎన్సీపీ (శరద్) పార్టీ ప్రకటించినప్పటికీ తాజాగా శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం రానట్లు
గతంలోనూ గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో 2012లో ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. అయితే ఆ తర్వాత నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితికిపై ఎలాంటి సమాచారం లేదు.
మహారాష్ట్రలోని అధికార మహయుతి ప్రభుత్వంపై విపక్ష మహా వికాస్ అఘాడి ఆదివారంనాడు విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, అవినీతి, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ఆక్షేపణ తెలిపింది.
మహారాష్ట్ర ఎన్నికల తర్వాత షిండేకు మద్దతుగా నిలిచిన నాయకులంతా నిరుద్యోగులు కావడం ఖాయమని శనివారంనాడు శివసేన యూబీటీ పార్టీ నిర్వహించిన ఉద్యోగ మేళా కార్యక్రమంలో ఉద్ధవ్ మాట్లాడుతూ చెప్పారు.
ముంబై యూనివర్శిటీ సెనేట్ ఎన్నికల్లో అన్ని సీట్లు శివసేన (యూబీటీ) యువజన విభాగం గెలుచుకోవడంపై ఆదిత్య థాకరే సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అనుబంధ ఏబీవీపీ సహా అందరూ చిత్తుగా ఓడిపాయారని, మాతోశ్రీలో సంబరాలు మిన్నంటుతున్నాయని చెప్పారు.