Home » Undi
రఘురామ కృష్ణం రాజు (Raghu Rama Krishna Raju) .. ఈయన వైసీపీకి (YSRCP) అస్సలు పడని మనిషి..! అలాంటిది ఈయన వైసీపీ కార్యకర్తల కంట పడితే.. ఇక వాళ్ల ఓవరాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి..! పోనీ ఆ ఓవరాక్షన్‌కు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి శనివారం సమావేశం అవబోతున్నారు. పెండింగ్ సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. సీఎంల భేటీ అభినందనీయం అంటున్నారు ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు. అదే సమయంలో తెలంగాణ నుంచి రావాల్సిన బకాయి నిధులు వస్తే బాగుంటుందని వివరించారు.
ఏపీవ్యాప్తంగా సోమవారం లబ్ధిదారులకు పెంచిన పెన్షన్లు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు.
మరో రెండు వారాల్లో లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. జూన్ 4వ తేదీన సరిగ్గా 8 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుపు, వచ్చే మెజార్టీపై జోరుగా బెట్టింగ్ జరుగుతోంది.
జూన్ 4వ తేదీ లోపు మరిన్ని దాడులు జరగవచ్చని.. ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆ పార్టీ నాయకుడు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) కీలక ఘట్టం ముగిసింది. ఏప్రిల్-18న ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఏప్రిల్-25తో ముగిసింది. ఇక నామినేషన్ల విత్ డ్రా కూడా ఇవాళ (ఏప్రిల్-29తో) ముగిసింది. ఈ ఎన్నికల్లో టికెట్లు దక్కని చాలా మంది నేతలు రెబల్స్‌గా మారి నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటంతో కొన్ని నియోజకవర్గాల సీట్లను తెలుగు తమ్ముళ్లకు ఇవ్వలేకపోయింది హైకమాండ్. దీంతో వారంతా రెబల్స్‌గా మారి నామినేషన్లు వేశారు. ఇందులో కొందరు నామినేషన్లు విత్ డ్రా చేసుకోగా.. మరికొందరు మాత్రం తగ్గేదేలా అంటూ బరిలోనే ఉన్నారు. విత్ డ్రాకు గడువు ముగియడంతో ఇప్పుడు వారందరికీ ఎన్నికల కమిషన్ గుర్తులను కేటాయించే పనిలో నిమగ్నమైంది.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. శుక్రవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండిలో వైసీపీ కాపు నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముద్రగడ పద్మనాభం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డబ్బులు కోసం సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చావా? అని పవన్ కల్యాణ్‌ను పద్మనాభం ప్రశ్నించారు.
ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని పార్టీలు దాదాపు అభ్యర్థులను ప్రకటించడంతో నామినేషన్లు వేస్తున్నారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వనున్నారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈలోపు ఇప్పటికే 144 నియోజకవర్గాల్లో అభ్యర్థులను టీడీపీ ప్రకటించగా.. తాజాగా నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చనున్నట్లు తెలుస్తోంది.
గతంలో ప్రకటించిన వారిలో నలుగురు అసెంబ్లీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ మార్చింది. గురువారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జోనల్ ఇన్‌చార్జుల సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయం తెలియజేశారు..
నరసాపురం సిటింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్‌లో చంద్రబాబుతో భేటీ సందర్భంగా ఈ నిర్ణయం జరిగినట్లు సమాచారం..