Home » UPI payments
డిజిటల్ చెల్లింపులను మరింత సౌలభ్యంగా చేసే లక్ష్యంతో గూగుల్ పే ఆరు రకాల కొత్త ఫీచర్లను ప్రకటించింది. ఈరోజు(ఆగస్టు 30న) ముంబైలో ముగిసిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (GFF) 2024లో ఈ మేరకు ప్రకటించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గూగుల్‌పే, ఫోన్‌పేలాంటి యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు జరపాలంటే వాటిని మన బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాల్సిందే! మరి బ్యాంకు ఖాతాలు లేనివారి పరిస్థితి?
స్మార్ట్ ఫోన్లతో భారత్‌లో గత ఆరేళ్లలో 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ తెలిపారు. డిజిటలైజేషన్లో భారత్ వేగాన్ని ఆయన ప్రశంసించారు.
కిరాణా దుకాణం నడుపుతున్న మహిళ మెడలోంచి పుస్తెల తాడు కొట్టేసేందుకు యత్నించి ఇద్దరు దొంగలు అడ్డంగా బుక్కయ్యారు. అంతకు ముందు ఆమె దుకాణంలో సిగరెట్లు కొని.. చేసిన పేటీఎం చెల్లింపు వారి వివరాలను బట్టబయలు చేసింది.
కరెంటు బిల్లులను ఇకపై గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీయం, బిల్డె్స్కలో చెల్లించడానికి వీల్లేదని డిస్కమ్‌లు తేల్చిచెప్పాయి.
రాష్ట్రంలో సోమవారం నుంచి ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే తదితర యాప్‌ల ద్వారా విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. ఆన్ లైన్ యాప్‌ల ద్వారా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ( TGSPDCL ) విద్యుత్ బిల్లులను స్వీకరించడాన్ని బ్యాంకులు నిలిపేశాయి .
దేశ వ్యాప్తంగా సైబర్ క్రైం కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 2024 తొలి త్రైమాసికంలో 33 శాతం సైబర్ క్రైం(Cyber Crimes) కేసులు పెరిగాయని సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ రిపోర్ట్ వెల్లడించింది. భారత్‌ని టార్గెట్ చేసుకుని ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి.
దేశంలో యూపీఐ చెల్లింపులు ప్రారంభమయ్యాక.. నగదురహిత లావాదేవీలు రూ.లక్షల కోట్లకు చేరుకున్నాయి. చిల్లర ఇబ్బందులను దూరం చేసిన యూపీఐ అనథి కాలంలోనే మారుమూల గ్రామాల్లోకి చేరుకుంది.
NPCI బోర్డు.. RBI ఆమోదంతో భారత్ వెలుపల రూపే (డొమెస్టిక్ కార్డ్ స్కీమ్), UPI పేమెంట్స్ అమలు చేయడానికి NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL)ని ప్రారంభించింది. UPI ప్రస్తుతం భారత్ సహా భూటాన్, మారిషస్, సింగపూర్, శ్రీలంక, UAE, ఫ్రాన్స్ వంటి ఆరు దేశాల్లో అందుబాటులో ఉంది.
డిజిటల్ భిక్షగాడి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.