Home » Uttam Kumar Reddy Nalamada
పది నెలల వ్యవధిలో 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రుణమాఫీలో తెలంగాణ రికార్డ్ సాధించిందని అన్నారు. 11 నెలల పాలనలో రూ.22 వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు.
బీఆర్ఎస్ నాయకులు పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెబుతారని.. ఈ ఏడాది మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో చుక్క నీరు లేకున్నా రాష్ట్రంలో 66.5 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల టన్నుల వరి దిగుబడి వచ్చిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
‘ఒక్క ఏడాదిలో రూ.54 వేల కోట్లతో రైతుల జీవితాల్లో పండుగ తెచ్చాం. ఇది నంబర్ మాత్రమే కాదు.. రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ నుంచి సింగూరు రిజర్వాయర్‌కు 20 టీఎంసీలు నీటిని తరలించడానికి ఉద్దేశించిన ప్యాకేజీ-19ఏ పనులను పునఃప్రారంభించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టుల పనులు నిర్ణీత గడువులోగా పూర్తిచే యాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పనులకు పరిపాలనపరమైన అనుమతుల జారీ, ఇతర నిర్ణయాల్లో అధికారులు ఎలాంటి జాప్యం చేయరాదని ఆదేశించారు.
వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో తెలంగాణలో కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
మహారాష్ట్ర ఎన్నికల తర్వాత లెండి ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకుపోతామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ, మహారాష్ట్ర అంతర్రాష్ట్ర ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తామని తెలిపారు.
‘‘రైతులు ధాన్యం ఎమ్మెస్పీకి అమ్ముకోవటానికి రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 7,750 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశాం. 80 లక్షల టన్నులు వచ్చినా, అంతకంటే ఎక్కువ ధాన్యం వచ్చినా కొనుగోలు చేయటానికి సరిపడా నిధులు సమకూర్చాం.
సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు ఛత్తీ్‌సగఢ్ నుంచి నిరభ్యంతర పత్రం పొందడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు.