Home » Uttam Kumar Reddy Nalamada
రాష్ట్ర ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం గురువారం జరిగింది.
రాజధాని హైదరాబాద్లో వాన దడ పుట్టించింది. గంటన్నర పాటు కుండపోతతో కంగారు పుట్టించింది. మంగళవారం తెల్లవారుజామున విరుచుకుపడింది. సరూర్నగర్లో 14.91 బాలానగర్లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రిజర్వాయర్లు, డ్యామ్లలో పేరుకుపోయిన పూడికను ఆదాయ వనరుల కోణంలోనే తీయాలని, ఆ నిధులను ప్రాజెక్టుల నిర్వహణకు వెచ్చించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఇప్పటివరకు అన్ని వివరాలు సరిగా ఉన్న 22,37,848 ఖాతాలకు రూ.2 లక్షల దాకా రుణమాఫీ చేశామని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు రుణమాఫీ(Rythu Runa Mafi) చేసినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణమాఫీ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని మంత్రి పేర్కొన్నారు. రైతులను ఏనాడూ పట్టించుకోని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పథకం అమలుపై తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహించారు.
ఏఐసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈరోజు(సోమవారం) రాజ్యసభ అభ్యర్థిగా తెలంగాణ అసెంబ్లీలో కాసేపటి క్రితమే నామినేషన్ వేశారు. సింఘ్వీ నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.
2029 పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నేత కష్టపడి పని చేసి ఆ దిశగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
‘రుణ మాఫీతో తెలంగాణలో రైతులు రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లా గడ్డపై నుంచి ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపుతామని మేం చెబితే..
ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి.. ఆ నీళ్లను గ్రావిటీతో ఎల్లంపల్లికి తరలిస్తామని చెబుతున్న కాంగ్రెస్ సర్కారు.. దానికి ప్రత్యామ్నాయంగా మరో రెండు ప్రాజెక్టులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 15, 2026నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి కృష్ణా పరీవాహక ప్రాంతానికి నీళ్లు తరలించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వారు ఉద్ఘాటించారు. ప్రాజెక్టు మూడు పంప్ హౌస్లు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు.