Home » Uttarakhand
దేశంలో మళ్లీ రుతుపవనాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురియనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఆ ప్రాంతాలేంటో ఇప్పుడు చుద్దాం.
పాడయిన ఓ ప్రైవేటు హెలికాఫ్టర్‌ను ఎయిర్ ఫోర్స్ ఎమ్ఐ - 17 హెలికాఫ్టర్‌తో గగనమార్గంలో తరలిస్తుండగా కూలిపోయింది. శనివారం హెలికాఫ్టర్‌ను కేదార్నాథ్ నుంచి గౌచర్‌కు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే నర్సుపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన సంఘటన ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో చోటుచేసుకుంది. సంఘటన జరిగిన తొమ్మిది రోజుల అనంతరం ఆమె మృత దేహం లభించింది. దర్యాప్తు జరిపిన పోలీసులు బుధవారం ఇందుకు బాధ్యుడైన నిందితుడ్ని రాజస్థాన్‌లో
జనావాసాల్లోకి చొరబడే పులులు, సింహాలు బీభత్సం సృష్టించడంతో పాటూ మనుషులు, వివిధ జంతువులపై దాడి చేయడం చూస్తుంటాం. సైలెంట్‌గా ఇళ్లల్లోకి చొరబడే పులులు కొన్నిసార్లు.. పిల్లులు, కోళ్లు, పెంపుడు కుక్కలపై దాడి చేసి చంపేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి..
కావడియాత్ర మార్గంలో హోటళ్ల యజమానులు తమ పేర్లను, సిబ్బంది పేర్లను ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై ఇచ్చిన స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
శివభక్తులైన కన్విరియాలు ఏటా చేపట్టే కావడి యాత్ర మార్గంలో తినుబండారాల దుకాణాల వద్ద యజమానుల పేర్లు ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలపై 'మధ్యంతర స్టే'ను సుప్రీంకోర్టు శుక్రవారంనాడు పొడిగించింది. తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది.
కార్గిల్ దివస్ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అగ్నివీరులకు రిజర్వేషన్ కల్పిస్తామని ఆయన ప్రకటించారు. సైన్యంలో విధులు నిర్వహించిన అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చిన అగ్ని వీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.
కన్వర్ యాత్ర(కావడి యాత్ర) మార్గంలోని తినుబండారాల యజమానులు బయట తమ పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర స్టే విధించింది.
భక్తుల(devotees) నడక మార్గంలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం చోటుచేసుకుంది. కేదార్నాథ్(Kedarnath) చిర్బాస సమీపంలో కొండపై నుంచి అకస్మాత్తుగా భారీ మొత్తంలో శిథిలాలు, బండరాళ్లు పడిపోయాయి. దీంతో అదే సమయంలో యాత్రకు వెళ్తున్న వారిలో ముగ్గురు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
శివ భక్తుల వార్షిక తీర్ధయాత్ర 'కన్వర్'లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. జూలై 22న కన్వర్ యాత్ర ప్రారంభమై ఆగస్టు 2వ తేదీతో ముగుస్తుంది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఉత్తరాఖండ్‌లోని రిషికేష్, హరిద్వార్‌కు కాలినడకన చేరుకుని గంగా జలాలను సేకరించి తిరిగి తమ స్థానిక శివాలయాల్లో సమర్పిస్తారు.