Home » Uttarakhand
దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగ పీఠాల్లో ఒకటైన ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయం నుంచి 228 కిలోల బంగారం మాయమైందని జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ తెలిపారు. కేదార్‌నాథ్‌లో 'గోల్డ్ కుంభకోణం' జరిగిందని మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్‌లోని రెండు కీలక అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. బద్రీనాథ్, మంగళౌర్‌లో విజయకేతనం ఎగురవేసింది. జూలై 10వ తేదీన జరిగిన ఉపఎన్నికల ఫలితాలను శనివారంనాడు ప్రకటించారు.
ఆ యువతి పేరు హర్షిక పంత్. ఆమె వయసు 21 సంవత్సరాలు. నడుము పక్షవాతంతో బాధపడుతున్న ఆమె బాల్యం నుంచే శ్రీకృష్ణుని భక్తురాలు. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి..
న్యూఢిల్లీ: బద్రీనాథ్ హైవేను అధికారులు మూసివేశారు. దీంతో మార్గమధ్యంలో 3వేల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజులపాటు పోలీసులు మూసివేశారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా బద్రీనాథ్ జాతీయ రహదారిపై విరిగి పడిన కొండ చరియలను తొలగించారు. దీంతో గురువారం నుంచి బద్రీనాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు పున: ప్రారంభమైనాయి.
ఉత్తరాఖండ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతుండటం, ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గర్వాల్ ప్రాంతంలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో చార్‌థామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు గార్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు.
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యాత్రికుల ప్రాణాలను బలిగొన్నాయి. శనివారం బద్రీనాథ్ జాతీయ రహదారిపై కర్ణప్రయాగ్‌కు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో కొండచరియలు విరిగిపడి.. బండరాళ్లు ఢీకొని ఇద్దరు హైదరాబాదీ పర్యాటకులు మృతి చెందారని పోలీసులు శనివారం వెల్లడించారు.
ఉత్తరాఖండ్ ను ఎడతెరిపి లేని వానలు, పొంగిపొర్లుతున్న నదులు వణికిస్తున్నాయి. గోముఖ్ ఫుట్‌పాత్‌పై గంగోత్రికి 8 నుంచి 9 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కుప్పకూలడంతో 30 నుంచి 40 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. ఇద్దరు యాత్రికులు దేవ్‌గఢ్‌లోని నదీ ప్రవాహం ఉధృతికి కొట్టుకుపోయారు.
వీధుల్లో బైకులతో విన్యాసాలు చేస్తామంటే కుదరదు. బైక్ అటు, ఇటు పోనిస్తూ వెళ్లేవారికి అలర్ట్. ఆకతాయిల పని పడతాం అని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అంటోంది. ఆకతాయిలకు ముకుతాడు వేసేందుకు హై ఎండ్ బైక్స్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. బీఎండబ్ల్యూ, హర్లీ డెవిడ్ సన్ బైక్ కొనుగోలు చేస్తామని చెబుతోంది. రహదారిలో భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది.