Home » Uttarakhand
తెలంగాణలో నకిలీ, నాసిరకం ఔషధాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఉత్తుత్తి మందులను అమ్ముతూ కేటుగాళ్లు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ అధికారులు చేస్తున్న దాడుల్లో నకిలీ మందుల ముఠాలు భారీగా బయటపడుతున్నాయి.
దేశంలోని అయోధ్య, వారణాసి, హరిద్వార్ సహా పలు ప్రాంతాల్లో గంగా దసరా(Ganga Dussehra 2024) పండుగ ఘనంగా ప్రారంభమైంది. గంగా దసరా పండుగ సందర్భంగా గంగామాతను పూజించడం, గంగా నదిలో స్నానం చేయడం, దానధర్మాలు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. ఈ క్రమంలో ఉత్తరాఖండ్(Uttarakhand), యూపీ(UP) సహా అనేక ప్రాంతాల్లో గంగా నది ఘాట్ల వద్ద భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తు్న్న టెంపో ట్రావెలర్ రుద్రప్రయాగ్ జిల్లాలోని అలకానంద నదిలో పడి 14 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 12 మంది వరకూ గాయపడ్డారు.
ఉత్తరాఖండ్(Uttarakhand) అల్మోరా(Almora) బిన్సార్ అభయారణ్యంలో చెలరేగిన కార్చిచ్చు(fire accident) ఇంకా చల్లారడం లేదు. ఈ అగ్నిప్రమాదం కారణంగా అడవులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మంటలు చెలరేగినట్లు సమాచారం అందుకున్న సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు అడవికి చేరుకున్నారు. ఆ క్రమంలో మంటలను ఆర్పేక్రమంలో అటవీ సిబ్బందిలో నలుగురు వ్యక్తులు మరణించారు.
ఉత్తరాఖండ్ లోని ఛమోలి జిల్లా జోషిమఠ్ తహసిల్ పేరు అధికారికంగా మారింది. జోషిమఠ్ ఇక నుంచి 'జ్యోతిర్మఠ్'గా పేరుమార్పు సంతరించుకుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఒకప్పుడు జ్యోతిర్మఠ్‌గానే ఈ పేరు వాడుకలో ఉండేది. క్రమంగా ఆ పేరు 'జోషిమఠ్'గా రూపాంతరం చెందింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చార్ధామ్ యాత్రకు ఏడాదిలో సుమారు ఆరు నెలలు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ యాత్రలో భక్తులు తప్పనిసరిగా సందర్శించి, పవిత్రస్నానాలు ఆచరించే ప్రదేశాలు...
మేలో ప్రారంభమైన ఉత్తరాఖండ్(uttarakhand)లోని చార్ధామ్ యాత్ర(Chardham Yatra)కు ఈసారి గతంలో కంటే రెట్టింపు సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. ఈ క్రమంలో గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ప్రాంతాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఈ ఏడాది మృతుల సంఖ్య కూడా పెరిగింది.
హెలికాఫ్టర్‌లో కేదార్నాథ్ బయలుదేరిన ఆరుగురు భక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కేదార్‌నాథ్‌లోని కేదారేశ్వరుడిని దర్శించుకునేందుకు ఆరుగురు భక్తులు శుక్రవారం సిర్సా నుంచి కేధార్నాథ్కు హెలికాఫ్టర్‌లో బయలుదేరారు.
ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి పోలీస్ వాహనం దూసుకెళ్లింది. ఆసుపత్రిలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రిషికేష్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చోటు చేసుకుంది.
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ఆసుపత్రిలోని ఎమర్జెనీ వార్డులోకి నేరుగా పోలీస్ వాహనం వెళ్లడం వైరల్ అవుతోంది.