Home » Vemula Veeresham
తాజాగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. తమకు టికెట్ రాకపోవడంతో కొందరు ఆశావహులు పార్టీని వీడుతున్నారు. వారిలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఒకరు. తనకు అన్యాయం జరిగింది కాబట్టే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని వేముల వీరేశం అన్నారు.
బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన అనంతరం అసమ్మతి నేతల అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నకిరేకల్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కేటాయించడంతో అసమ్మతి రేగింది. నకిరేకల్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు.
తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections) సమీపిస్తున్నాయ్.. దీంతో ఏ పార్టీలో టికెట్లు (MLA Tickets) దొరుకుతాయ్..? ఏ పార్టీ తరఫున అయితే గెలిచే అవకాశాలున్నాయ్..? అని సర్వేలు (Surveys) చేయించుకొని మరీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు జంపింగ్‌లు షురూ చేశారు. గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR) ఈనెల 12న లేదా 13న 87 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితాను ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి...