Home » Vemuri Radhakrishna
ఎంబీబీఎస్‌లో సీటు సాధించినా కళాశాల ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్న ఓ నిరుపేద విద్యార్థినికి ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ అండగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు మహర్దశ నడుస్తున్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనను ముప్పుతిప్పలు పెట్టడమే కాకుండా చివరకు జైలుకు కూడా పంపిన జగన్మోహన్రెడ్డి జుత్తు మాత్రమే కాదు....
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు బుధవారం హైదరాబాద్‌లో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు.
‘‘తెలుగు రాష్ట్రాలను ఇంగ్లిష్ అనే వ్యామోహం కమ్మేసింది’’ అని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మినహా మరే రాష్ట్రంలోనూ మాతృభాషకు ప్రమాదం లేదని, ఈ విషయంలో ఒడిశా కూడా మనకన్నా మెరుగ్గానే ఉందని వ్యాఖ్యానించారు.
విజయసాయి వంటి నీచ నికృష్టుడికి ఉన్న తెలివితేటలు తనకు ఉన్నట్టయితే రోత మీడియా వలె ఒకేసారి 23 ఎడిషన్లు ప్రారంభించి ఉండేవాడిని. తాను బ్లాక్ మెయిల్ చేస్తానని, డీల్ మేకర్ని అని కూడా ఈ నీచుడు నిందించాడని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ అన్నారు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించే బుద్ధి ఉంటే ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్, జగన్‌రెడ్డితో ఏకకాలంలో పోరాడాల్సిన అవసరం తనకేంటని ఆర్కే ప్రశ్నించారు.
జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో పరోక్షంగా అంటకాగిన సీపీఎం నాయకులు ఇప్పుడు జెండాలను బయటకు తీసి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జగన్‌రెడ్డి పార్టీతో పరోక్షంగా స్నేహం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్
దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబం బజారున పడింది. నిన్నటి దాకా వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో కుటుంబంలో గొడవలు ఏర్పడగా, ఇప్పుడు ఆస్తుల వివాదం తెర మీదకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పదహారు మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో కాసు బ్రహ్మానంద రెడ్డికి...
ఆంధ్రజ్యోతి దినపత్రిక నూతన ఎడిటర్‌గా ఎన్.రాహుల్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 16 ఏళ్లకుపైగా ఆంధ్రజ్యోతి ఎడిటర్‌గా విశిష్ట సేవలందించిన కె.శ్రీనివాస్ ఉద్యోగ విరమణ చేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రజ్యోతి.. ఎడిటర్లను తయారు చేసే ఫ్యాక్టరీ. ఇక్కడ పనిచేసిన వారెంతో మంది సంపాదకులుగా ఎదిగారు.
ఏబీఎన్ అనగానే చటుక్కున గుర్తుకు వచ్చే పేరు వేమూరి రాధాకృష్ణ. ప్లానింగ్ పర్వం నుంచి ప్రసార పర్వం పూర్తయ్యే దాకా.. ప్రతి దానిలో ఆయన మార్క్ స్పష్టంగా ఉంటుంది. పాత్రికేయ కోణంలో అన్ని అంశాలను స్పృశించి.. విశ్లేషించే సమర్థత కలిగిన నిఖార్సైన జర్నలిస్ట్ వేమూరి రాధాకృష్ణ.