Home » Videos
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. జీవితంలో ఎవరిని ప్రేమించినా.. ప్రేమించకపోయినా.. తల్లిని చెల్లిని అంతా ప్రేమిస్తారన్నారు. కానీ వైఎస్ జగన్ మాత్రం వారిని కోర్టుకు కీడ్చాడని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి మేలు చేస్తాడంటే.. విజ్ఞులైన ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
పల్నాటి గడ్డపై మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ విగ్రహాన్ని ఏర్పాటు అడ్డుకోవడం తీవ్ర బాధాకరమని ఆయన కుమారుడు డాక్టర్ కోడెల శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ శ్రేణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన వివరించారు.
కర్ణాటకలో ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయనున్నారంటూ ఓ ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. అలాంటి వేళ.. ఈ ప్రచారంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం బెంగళూరులో స్పందించారు. మహిళలు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చేస్తున్నామంటూ జరుగుతున్న ఊహాగానాలను ఆయన ఖండించారు.
అన్నాచెల్లెలు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఆస్తి పంపకాల వివాదంలో వై వీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి స్పందించారు. దీంతో ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందనేది ఎవరికి ఏం అర్థం కాలేదు. అలాంటి వేళ.. వైఎస్ విజయమ్మ మంగళవారం స్పందించారు. ఈ వ్యవహారంపై ఆమె బహిరంగ లేఖ రాశారు. అందులో ఆమె కీలక విషయాలను ప్రస్తావించారు. అయితే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ కుటుంబానికి ఏదో దిష్టి కొట్టిందన్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆస్తి పంపకాలపై వారి తల్లి వైఎస్ విజయమ్మ స్పందించారు. ఆ క్రమంలో ఆమె బహిరంగ లేఖ రాశారు. అందులోభాగంగా తమ సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డితోపాటు ఆడిటర్, ఎంపీ విజయసాయిరెడ్డిల వ్యవహారశైలిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ఆర్ బిడ్డలు వైసీపీ అధినేత వైఎస్ జగన్, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల రగడ.. పెద్ద దుమారం రేపింది. ఈ అంశంపై వైసీపీలోని అగ్రనేతలు వైవీ సుబ్బారెడ్డితోపాటు ఆడిటర్, ఎంపీ విజయసాయిరెడ్డి సైతం తమదైన శైలిలో స్పందించారు. దీంతో అన్నా చెల్లెల మధ్య ఆస్తుల విషయంలో తీవ్ర రచ్చ జరుగుతుంది. దీంతో ఎవరు మాటలు నమ్మాలి.. ఎవరివి నమ్మకూడదనే విషయంలో ప్రజలకు తీవ్ర ఆయోమయానికి గురయ్యారు.
సిద్దిపేట జిల్లా తిమ్మారెడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రార్థనా మందిరం నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. నిర్మాణాన్ని అడ్డుకొని గోడ కూల్చారంటూ ఓ వర్గంపై మరో వర్గం కుకూనురుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఓ వర్గానికి చెందిన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అరెస్టుయిన వారికి బీజేపీ ఎంపీ ఆర్ రఘునందన్‌రావు మద్దతుగా నిలిచారు.
జన్వాడ పామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరిగిందంటూ జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇది రేవ్ పార్టీ కాదన్నారు. మాములుగా కుటుంబ సభ్యులంతా కలిసి పార్టీ చేసుకున్నారన్నారు. ఈ పార్టీలో 70 ఏళ్ల వయస్సు ఉన్న వారి నుంచి నాలుగు, మూడేళ్లు ఉన్న చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు.
జన్వాడ ఫామ్ హౌస్ ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. రాజ్ పాకాల, శైలేంద్ర పాకాల నివాసాల్లో సోదాలపై డీజీపీ జితేంద్రకు పోన్ చేసి మాట్లాడారు. సర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు నిర్వమిస్తున్నారని ప్రశ్నించారు. తనిఖీలు వెంటనే ఆపాలని డీజీపీని కేసీఆర్ కోరారు. అయితే ఈ కేసులో విజయ్ మద్దురిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ అక్టోబర్ 29 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం అమరావతిలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పథకం అర్హులు తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలన్నారు.