Home » Videos
ఐఏఎస్ అమోయ్‌కుమార్‌పై హైదరాబాద్‌లోని మధురానగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని 840 మంది ప్లాట్ ఓనర్లను మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అమోయ్ కుమార్ అక్రమాలపై ఇప్పటికే కోర్టుల్లో పోరాడుతున్నామని వారు తెలిపారు. అమోయ్ కుమార్‌ను ఈడీ విచారిస్తుంది.
అమరావతిలో రైలు మార్గానికి తొలి అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతికి రైలు మార్గాన్ని ప్రకటించింది. ఎరుబాలెం నుంచి అమరావతి మీదగా నంబూరు వరకు కొత్త రైల్వే లైన్‌కు శ్రీకారం చుట్టునుంది. ఆధ్యాత్మిక ప్రాంతాలతోపాటు మెట్రో నగరాలను కలుపుతూ ఈ రైల్వే నిర్మాణం జరగనుంది.
దానా తుపాన్ గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం ఉదయం లోపు ఒడిశాలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఒడిశాకు తుపాన్ తాకిడి అధికం. ఎప్పుడు తుపాన్ వచ్చిన.. తక్కువ ప్రాణ, ఆస్తి నష్టం ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంటుంది. తుపాన్ వచ్చిందంటే చాలు.. అంతకు ముందే ఒడిశా అప్రమత్తమవుతుంది. అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుంది.
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన పరువు, ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా మాట్లాడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం నాంపల్లి కోర్టుకు తెలిపారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి ప్రత్యేక కోర్టును ఈ సందర్బంగా కేటీఆర్ అభ్యర్థించారు. ఈ సందర్బంగా కేటీఆర్ వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. అనంతరం ఆమె వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఆరోపణలు గుప్పించారు. జగన్ మోహన్ రెడ్డికి మహిళల మీద గౌరవం లేదన్నారు. మహిళల అభ్యున్నతికి ఆయన ఎప్పుడు పాటు పడలేదని చెప్పారు. ఆయన ప్రభుత్వ హయాంలో మహిళలపై జరిగిన దాడులపై స్పందించలేదని గుర్తు చేశారు. ఆయనే కాదు.. అప్పటి హోం శాఖ మంత్రి సైతం స్పందించలేదంటూ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా వైఎస్ జగన్ పాలనను విమర్శించారు.
రాజమండ్రిలో జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు సిటి ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. అక్టోబర్ 26వ తేదీన ఆర్ట్ కాలేజీలో ఈ జాబ్ మేళ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ జాబ్ మేళ ద్వారా 5 వేల జాబులు కల్పించాలని నిర్ణయించామన్నారు. ఈ జాబ్ మేళకు 50 సంస్థలు హాజరవుతాయని చెప్పారు. నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
షాద్‌నగర్-ఆమన్ గల్ రూట్లలో బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు విద్యార్థులు లేఖ రాశారు. ఈ రూట్లో గతంలో 10 బస్సులు నడిపితే.. ప్రస్తుతం 4 బస్సులే నడుపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రూట్లో బస్సుల సంఖ్యను పెంచాలని ఆర్టీసీ ఎండీకి రాసిన లేఖలో విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.
తమకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని ఓ వృద్ధ దంపతులు కలెక్టర్‌ను కోరారు. ఈ ఘటన ఏలూరులో చోటు చేసుకుంది. తాము చనిపోవాలనుకుంటున్నామని.. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని వారు కలెక్టర్‌ను కలిసి అభ్యర్థించారు. ఏలూరు రూరల్ మండలం గుడివాకలంకకు చెందిన సైదు ఇజ్రాయెల్, సైదు మహాలక్ష్మీ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారికి రెండు ఎకరాల భూమి ఉంది.
ఈ కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. ఈ ఆరోపణలపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడి చేసిన నిందితులను గంటల వ్యవదిలో పట్టుకున్నామన్నారు. అయితే మీరు ఆరోపించినట్లు అత్యాచార బాధితుల సమాచారానికి సంబంధించిన జాబితా ఇస్తే.. విచారణ జరిపిస్తామని ఆర్కే రోజాకు మంత్రి సవిత సవాల్ విసిరారు.
నల్గొండ జిల్లాలోని బీబీనగర్ ఏయిమ్స్ ఆసుపత్రి రాసలీలకు అడ్డాగా మారింది. ఏయిమ్స్‌లో రాసలీలల బాగోతం బయటపడింది. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చి రోగి బంధువులకు సిబ్బంది అర్థనగ్నంగా కనిపించారు. ఈ దృశ్యాన్ని రోగి బంధువులు వీడియ తీశారు. అనంతరం అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.