Home » Videos
అనుమతులున్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేయబోదని ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు. చట్టబద్దమైన అనుమతులతో నిర్మాణాలు చేపట్టిన వారెవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలను సైతం కూల్చివేస్తామంటూ ప్రచారం జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని పలువురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. నిడదవోలు సర్కిల్ పెరవలి పరిధిలో పోలీసు ఉన్నతాధికారులతోపాటు సిబ్బంది పేకాట కేసులో చేతి వాటం చూపించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వారిపై శాఖపరమైన విచారణ జరిగింది.
పులివెందుల ఎమ్మెల్యే, మాజీ సీఎం వైఎస్ జగన్.. బుధవారం విలేకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు మూస ధోరణిలోనే ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండగానే కాదు.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సైతం నాటి ప్రతిపక్షాలపై దోచుకో.. పంచుకో.. తినుకో.. అంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలే మళ్లీ మళ్లీ చేస్తున్నారనే చర్చ జరుగుతుంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీసీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియా ముందుకు వచ్చి.. కూటమి పాలనపై విమర్శలు గుప్పించారు. దీనిపై ఏపీ బీజేపీ సీనియర్ నేత భాను ప్రకాశ్ రెడ్డి శుక్రవారం స్పందించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై వీరు చేస్తున్న విమర్శలు.. వారి పాలనలో చోటు చేసుకున్నాయని ఆయన గుర్తు చేశారు.
ఏపీకి కేటాయించిన ఐఏఎస్లకు హైకోర్టులో చుక్కెదురైంది. తమను తెలంగాణలోనే విధులు నిర్వహించుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పెట్టుకున్న పిటిషన్ హైకోర్టు బుధవారం కొట్టేసింది. వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలంటూ వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సజ్జల విలేకర్లతో మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందన్నారు.
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో వాల్ పోస్టర్ల కలకలం రేగింది. కట్లకుంట గ్రామంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆగంతకులు వాల్ పోస్టర్లు అంటించారు. గ్రామంలో ఉన్న మంత్రగాళ్లు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. మంత్రగాళ్లను ఒక్కొక్కరిగా హత్య చేయబోతున్నామంటూ ఆ వాల్ పోస్టర్లలో పేర్కొన్నారు.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది స్థానిక సంస్థల ఎన్నికలే. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందుకోసమే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో స్థానిక నాయకులనే భాగస్వామ్యం చేశారనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్లో ఓ చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే.. ఈ ఎన్నికల్లో స్థానిక నాయకుల ప్రభావం కీలకంగా ఉంటుంది.
ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నవరాత్రులు పూజలు అందుకున్న లంబోదరుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. మంగళవారం ఉదయం 6:15 గంటలకు ఈ శోభాయాత్ర ప్రారంభమైంది.
ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. అందులోభాగంగా గురువారం కొండాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ తన అనుచరులతో కలిసి వెళ్లారు.