Home » Vijayawada
కృష్ణా నదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బుధవారం ప్రకాశం బ్యారేజీని వైఎస్ షర్మిల పరిశీలించారు.
Andhrapradesh: వరద బీభత్సం నుంచి బెజవాడ వాసులు ఇంకా కోలుకోని స్థితిలో ఉన్నారు. గత నాలుగు రోజులుగా వరద నీటిలోనే వరద బాధితులు జీవనం గడుపుతున్నారు. దాదాపు 15 డివిజన్ ప్రజలు వరద నీటిలోనే ఉన్నారు. వరద ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో వేలాది మంది బాధితులు కాలనీలను వదలి బయటకు వెళ్తున్నారు.
ఇవాళ(బుధవారం) తెల్లవారుజూము నుంచి ఎన్టీఆర్, గుంటూరు, తూ.గో. జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మైలవరం నియోజకవర్గంలోని వరద బాధిత ప్రాంతాలైన విజయవాడ రూరల్, జక్కంపూడి పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు.
తెలుగు రాష్ట్రాలను వరణుడు ఎంతలా వణికిస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ జిల్లాలు, ఏపీలో విజయవాడ జిల్లా వరదలతో తీవ్రంగా ప్రభావితమైంది.
ఎక్కడుంది లోపం.. ఎవరిది వైఫల్యం.. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగినా..
విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపునకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎఎల్) స్పందించింది. తక్షణ సహాయానికి ముందుకొచ్చింది. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా మొదటి రోజు లక్ష మందికి ఆహారాన్ని పంపిణీ..
కష్టాల్లో ఉన్నవారిని వదిలేయలేదు.. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వరదైనా.. బురదైనా తడపడలేదు. తన ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారు. కాన్వాయ్‌ని సైతం పక్కన పెట్టేసి.. నేరుగా బురద నీటిలోకి దిగి మరీ ప్రజల వద్దకు వెళ్లారు. సీఎం అంటే ఇలా ఉండాలని నిరూపించారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు ఇప్పుడిప్పుడు ఊపందుకుంటున్నాయి. ఈ కార్యక్రమాలను మరింత ముమ్మరంగా కొనసాగించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైన ప్రకటన చేశారు.
Andhrapradesh: 48 గంటలుగా మహోగ్రరూపం దాల్చిన బుడమేరు కాస్త శాంతించింది. దీంతో బుడమేరులో గండి పడిన ప్రాంతాన్ని పూడ్చేందుకు ఇరిగేషన్ అధికారులు సిద్ధమయ్యారు. మొత్తం మూడు చోట్ల గండ్లు పడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో యుద్ధ ప్రతిపాదికన పనులను చేపట్టారు.
Andhrapradesh: బెజవాడలో వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సహాయక చర్యలను ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంది. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారికి ఆహారం సరఫరా కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. హెలికాఫ్టర్లు, పడవలు ద్వారా వరద బాధితులకు ఆహారం, పాలు, మందులను సరఫరా చేస్తోంది.