Home » Vijayawada
లిక్కర్ స్కాం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. మరోవైపు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీకి తరలించారు. మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
వైసీపీ హయాం నాటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నియామకాల్లో జరిగిన అక్రమాలను విజయవాడ పోలీసులు వెలికితీస్తున్నానే. విచారణలో కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో మధుసూదన్ను పోలీసులు A-2గా చేర్చారు.
జూన్ 1 నుంచి ఇండిగో సంస్థ విశాఖపట్నం-విజయవాడ మధ్య విమాన సర్వీస్ను పునఃప్రారంభిస్తోంది. ఉదయం 7.15కి విజయవాడ నుంచి బయలుదేరి 8.25కి విశాఖ చేరుకుని, తిరిగి 8.45కి బయలుదేరి 9.50కి విజయవాడకు చేరుకుంటుంది.
మండువేసవిలో కురిసిన అకాల వర్షం రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టం కలిగించింది. పిడుగులు, ఉరుములు, ఈదురుగాలులు, పిడుగులతో సహా కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించి, 8 మంది మరణించారు, వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
ఏపీటీడీసీ డివిజనల్ కార్యాలయంలోని కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగి రాసలీలలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. రాసలీలల అధికారిపై విచారణ జరిపి.. ఆ నివేదిక ఎగ్జిక్యూటివ్ ఈడీ పద్మావతికి ఇచ్చారు. తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నవారు.
Amaravati Re Launch: అమరావతి పున:ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే వందల బస్సుల్లో ప్రజలు అమరావతి సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు.
ప్రధాని మోదీ ఏపీ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. గన్నవరం విమానాశ్రయం పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. 15 సెక్టార్లుగా బందోబస్తును అధికారులు విభజించారు. ఒక్కొక్క సెక్టార్‌కు ఎస్పీ, ఏ ఎస్పీ స్థాయి అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రధాని మోదీ తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం రానున్నారు.
పాక్‌కు వెళ్లిన విజయవాడ కోడలు మోనికా రజని, కుమార్తెతో కలిసి అటారీ సరిహద్దు గుండా తిరిగి భారత్ చేరుకుంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ వచ్చిన 70కి పైగా పాక్ మహిళలలో ఆమె ఒకరు
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్రానికి పదేళ్లుగా చేసిన మోసంపై ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. విభజన హామీల్లో రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యత అని, ఆ బాధ్యతకు కట్టుబడి ఉన్నానని, ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తానని రాసి ప్రధాని మోదీ సంతకం చేయాలన్నారు.
Devineni Son Wedding: మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరైన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లిలో సీఎం రేవంత్, మంత్రి లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.