Home » Vijayawada
సింహాచలం ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ ఎయిర్‌పోర్టు ఏపీలో అత్యధిక 40 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. రాజమండ్రి, తిరుపతి, విశాఖ వంటి విమానాశ్రయాల్లోనూ ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
పాకా సత్యనారాయణను బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీయే కూటమి తరపున ఎంపిక చేసింది. ఈ సందర్బంగా మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆయనకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, సోము వీర్రాజు, పార్ధసారధి, ఇతర నేతలు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.
పీఎస్సార్ ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. గ్రూప్ -1లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హాయ్ ల్యాండ్‌లో జరిగిన గ్రూప్ -1 పేపర్ మూల్యాంకనం గుట్టు రట్టు చేసే దిశలో ప్రత్యేక పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.
మే నెల చివరి నాటికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను పూర్తిచేయించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) భావిస్తోంది. జూన్ మొదటి వారంలో విస్తరణ పనులకు అవసరమైన అనుమతులను తీసుకురావాలని యోచిస్తోంది.
CID Custody: ముంబై నటి జెత్వానీ అక్రమ అరెస్ట్, నిర్బంధం కేసుకు సంబంధించి పీఎస్‌ఆర్ ఆంజేయులును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
గ్రామ ఉద్యాన సహాయకులు, వ్యవసాయ శాఖ కబంధ హస్తాల నుంచి ఉద్యాన శాఖను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాబ్ చార్ట్ ప్రకారం మాత్రమే విధులు నిర్వహించాలన్నారు
అంబేద్కర్‌ను అవమానపరిచింది.. అలాగే ఆయన ఆశయాలను తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీ అని, అంబేద్కర్ చరిత్ర తెలియకుండా కాంగ్రెస్ వ్యక్తులు మాట్లాడుతున్నారని మంత్రి సత్య కుమార్ విమర్శించారు. అంబేద్కర్ పోటీ చేస్తే ఆయన్ని ఓడించేందుకు వేరొక వ్యక్తిని బరిలోకి దించిన పార్టీ కాంగ్రెస్ అని మంత్రి ధ్వజమెత్తారు.
Kesineni Brothers War: కేశినేని బ్రదర్స్ మధ్య సోషల్ మీడియా వార్ ముదురుతోంది. అన్నదమ్ములు ఇద్దరు ఒకరిపై ఒకరు వరుస ట్వీట్లతో రెచ్చిపోతున్నారు.
ఏపీ ముఖ్యంత్రి అధ్యక్షతన రెండో రోజు ఏఐ వర్క్‌షాపు ఏపీ సచివాలయంలో ప్రారంభమైంది. టెక్నాలజీ వినియోగంతో రియల్ టైమ్ పాలనను ప్రజలకు అందించాలని, స్మార్ట్ పాలనకు ‘4.ఓ’లో అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.