Home » Vijayawada
గ్రామాలు స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలుగా ఏర్పడాలని గాంధీజీ చెప్పేవారని, తాను నగరాల్లో ఉన్నా.. పల్లెల్లో ఉండాలనే కోరిక ఉండేదని డిప్యూటీ సీఎం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పల్లెల అభివృద్ధి ఎంతో కీలకం అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులు వాటికే ఖర్చు చేయాలని చెప్పానని.. అలాగే అమలు చేస్తున్నానని చెప్పారు.
PSR Prisoner Number: నటి జెత్వానీ కేసులో పీఎస్‌ఆర్ అరెస్ట్ అయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. విజయవాడ జిల్లా జైలులో పీఎస్‌ఆర్ ఆంజనేయులుకు ఖైదీ నెంబర్ 7814ను కేటాయించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సంబంధిత సాంకేతికతలను సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవడం.. పబ్లిక్ సర్వీస్ డెలివరినీ వేగవంతం చేసేందుకు అవసరమైన అవగాహనను స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిఫల్ సెక్రటరీలు, సెక్రటరీలు, శాఖాధిపతులకు కల్పించే లక్ష్యంతో వర్కుషాపు నిర్వహిస్తున్నారు.
విజయవాడలో ఓ వృద్ధురాలిని హత్య చేసిన కేసులో మెదక్ జిల్లా గంగాపూర్‌కు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు పోచమ్మను తన కొడుకును చూపిస్తామని తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు
Vamsi Court Appearance: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ రిమాండ్ నేటితో ముగియడంతో విజయవాడ కోర్టులో ఆయనను హాజరుపర్చారు పోలీసులు.
కేశినేని నాని చేసిన ట్వీట్‌కు ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. సోషల్ మీడియా రోడ్లపై మతి భ్రమించి ఓ సైకో తిరుగుతున్నారని, సోషల్ మీడియాలో కసి, పగ, ద్వేషంతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. విజయవాడ అభివృద్ధిపై ఆ సైకో విషం చిమ్ముతున్నారని, అలాంటి ట్వీట్‍లకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు.
PSR Court Hearing: నటి జెత్వానీ కేసులో పీఎస్‌ఆర్ ఆంజనేయులును కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పాత్ర లేకపోయినా తన మీద కేసు పెట్టారని పీఎస్‌ఆర్ వాదించారు.
PSR Remand Report: పీఎస్‌ఆర్ ఆంజనేయులు రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అంతా పథకం ప్రకారమే జరిగిందంటూ దర్యాప్తు అధికారి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలును ఐటీ విద్య శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. పదో తరగతి రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను సయితం విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. టెన్త్‌తో పాటు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. ఫలితాలను ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ విడుదల చేస్తారు.