Home » Vijayawada
Pawan Kalyan: రాజ్యాంగ ద్రోహానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా నిలబడదామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మన ప్రజాస్వామ్య గౌరవాన్ని నిలబెట్టిన వారి త్యాగాలను గుర్తుచేసుకోవడానికి సంవిధాన్ హత్య దివస్ను పాటిస్తామని అన్నారు.
AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్లో బుధవారం విచారణకు రావాలంటూ చెవిరెడ్డి మోహత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా.. ఈ రోజు విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. ఈ కేసులో మోహిత్ రెడ్డి ఏ-39గా ఉన్న విషయం తెలిసిందే.
Police Ride: విజయవాడ, గవర్నర్పేట అట్టా రత్తయ్య వీధిలోని వైసీపీ నాయకుడు కోసూరు మణికి చెందిన భవనంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. విశ్వాసనీయ సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ భవనంపై దాడి చేశారు.
చదువులో వెనకబడిన పిల్లల కోసం రూపొందించిన ప్రత్యేక బోధనా తరగతుల కార్యక్రమం ‘విద్యాశక్తి’ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు కోరారు.
MP Kesineni Chinni: నేరాల నియంత్రణకు పోలీసులు సీసీ కెమెరాలను అస్త్రాలుగా వాడుతున్నారని, విజయవాడ పోలీసు కమిషనరేట్లో అనేక కాలనీలు, అపార్ట్మెంట్లో వందలాది సీపీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు.
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మంగళవారం సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపి ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేబినెట్ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.
Konakalla fire on Jagan: గత ఐదేళ్లు అబద్దాలు ప్రచారం చేసినందుకే రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లకే పరిమితం చేసి బుద్ది చెప్పారని ఏపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. అయినా ఇంకా అవే అబద్దాలతో ప్రజలను మాయ చేయాలని జగన్ యత్నిస్తున్నారని మండిపడ్డారు.
YCP: ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పర్యటనలో ఆయన నోటి నుంచి వచ్చిన ‘రప్పా రప్పా’ డైలాగ్ ప్రభావం ఆ పార్టీ కార్యకర్తలపై పడింది. దీంతో వారు పేట్రేగిపోతున్నారు. రప్పా రప్పా అని నరికితే మంచిదేనన్న జగన్ కామెంట్లతో సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు.
BJP: ప్రధాని మోదీ యువతకు వివిధ రూపాల్లో ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని.. రైతులు, యువత, మహిళలను అభివృద్ధి పథంలో నడపాలని, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయూతను ఇస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురవడంతో పోలీసు అధికారులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.