Home » Vinayaka Chaviti
విఘ్నాలను తొలగించే మహా నాయకుడు వినాయకుడు. వినాయక చవితి నాడు గణనాథుని ప్రతిమ ప్రతి ఇంట్లో కొలువు తీరుతుంది. ఏకదంతుడి పూజను ఆధ్యాత్మిక సౌరభాలతో, ఆనందోత్సాహాలతో చేసుకుంటారు. ఈ పూజలో అనేక పత్రాలను ఆయనకు సమర్పిస్తారు.
గణే శ ఉత్సవాలను ప్రశాంత వాతా వరణంలో చేసుకోవా లని లక్కి రెడ్డిపల్లె సీఐ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సూచించారు.
స్థానిక ఏపీ మోడల్ స్కూల్లో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ముందస్తు వినాయక చవితి సంబరాలను నిర్వహించారు. పర్యావరణ కాలుష్య రహిత మట్టి వినాయక ప్రతిమల ను పూజించడం ద్వారా భక్తితో పాటు మా నసిక ఆరోగ్యం సిద్దిస్తాయన్నారు.
ఖైరతాబాద్‌లో సప్తముఖ మహాశక్తి రూపంలో వినాయకుడు కొలువై ఉన్నాడు. గణపతి కుడివైపున శ్రీనివాస కల్యాణం, ఎడమవైపు శివపార్వతుల కల్యాణ ప్రతిమలను నెలకొల్పారు. అయోధ్యలో ప్రతిష్టించిన బాల రాముడు, రాహువు, కేతువును ప్రతిష్టించారు.
హిందూ సంప్రదాయంలోని అన్ని పండగలకు దాదాపుగా ప్రకృతితో ఏదో ఒక విధంగా సంబంధం కలిగి ఉంటుందన్నది సుస్పష్టం. శనివారం అంటే.. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
రేపే వినాయక చవితి. దేశవ్యాప్తంగా ఊరు వాడా వినాయకుడి పందిళ్లుతో ముస్తాబవుతుంది. వివిధ రకాల భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నా పెద్దలంతా కలిసి ఈ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ప్రతీ ఇంట్లో వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించి ఆ కుటుంబ సభ్యులు పూజలు నిర్వహిస్తారు.
ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్(Khairatabad) మహాగణపతి(Lord Vinayaka) దర్శనం వినాయక చవితికి ఒక రోజు ముందే ప్రారంభమైంది. వరసగా 70ఏళ్ల నుంచి విగ్రహం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈసారి 70అడుగుల భారీ విగ్రహాన్ని నిర్వాహకులు పెట్టారు.
ఖైరతాబాద్(Khairatabad) భారీ గణపతి భక్తుల పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. ముహూర్తం ప్రకారం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శిల్పి చినస్వామి రాజేంద్రన్ గణపతికి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోశారు. భక్తులు పెద్ద ఎత్తున జయజయ ధ్వానాలు చేస్తూ గణేష్ మహారాజ్‌కీ జై అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు.
పట్టణంలోని వాసవీ ఆలయంలో ఆర్యవైశ్య అఫిషియల్స్ అండ్ ప్రొఫిషనల్స్ అసోసియేషన (అవోపా) ఆధ్వర్యంలో 250 మట్టి వినాయక ప్రతిమలను గురువారం పంపిణీచేశారు. ఈ కార్యక్రమానికి అవోపా జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి జయంతి సత్యరామ్, జిల్లా మాజీ అధ్యక్షుడు జయంతి శ్రీనివాసులు, ముఖ్య అతిథులు గా హాజరైయ్యారు.
వినాయక చవితిని పురస్కరించుకుని హిందూపురంలో విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు మండపాలను సిద్ధం చేశా రు. గతంలో ఎన్నడూలేని విధంగా భారీ ఎత్తున విగ్రహాలు ఏర్పాటు చేయ నున్నారు. కరోనా తరువాత ఎక్కువ సంఖ్యలో విగ్రహాల ఏర్పాటు ఈసారి జరుగనున్నట్లు పోలీసుల వద్ద అనుమతులను బట్టి తెలుస్తోంది.