Home » Viral Video
ప్రస్తుతం పెళ్లి అంటే డ్యాన్సులు, పాటలు, సరదాలు, హంగామా తప్పక ఉండాల్సిందే. భారీ ఊరేగింపులు, కమ్మని విందులతో పాటు వధూవరుల బంధువులు, స్నేహితులు కచ్చితంగా చిందులేయాల్సిందే. ఇక, వధూవరులు కూడా కాలు కదిపితే ఆ సంబరమే వేరుగా ఉంటుంది.
ఫిట్‌గా మారాలనే కోరిక ఉన్నప్పటికీ చాలా మంది జిమ్‌కు వెళ్లలేరు. అలాంటి వారి కోసం ఢిల్లీ ఐఐటీకి చెందిన విద్యార్థులు వినూత్న ఆవిష్కరణ చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రాకు కూడా ఆ ఆవిష్కరణ నచ్చింది. దీంతో ఆయన తన ట్విటర్ ఖాతాలో ఆ వీడియోను పంచుకుని ప్రశంసలు కురిపించారు.
ప్రస్తుతం ఓ యువజంటకు సంబంధించిన రొమాన్స్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. బహిరంగ ప్రదేశంలో ఆ యువతీయువకులు ప్రదర్శించిన అత్యుత్సాహం సోషల్ మీడియాకు ఎక్కింది. ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
నీటి కోసం ఎంతో దూరం నడిచి వెళ్లడం, బిందెలు పట్టుకుని కుళాయిల ముందు, బావుల మీద నిల్చువడం కొన్ని ప్రాంతాల్లో సర్వ సాధారణం. నీటిని నింపుకోవడం కోసం మహిళలు భారీ ఫైటింగ్‌కు దిగాల్సి ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నీటి కోసం ఇద్దరు మహిళలు యుద్ధానికి దిగారు.
కాలేజీకి వెళ్లే వయసులో చేసే అల్లరి, తరగతి గదిలో స్నేహితులతో కలిసి చేసిన చిలిపి పనులను ఎవరూ అంత త్వరగా మర్చిపోరు. ముఖ్యంగా క్లాస్‌లో బ్యాక్ బెంచ్‌లో కూర్చునే విద్యార్థులు ఒక్కోసారి పరిధి దాటి అల్లరి చేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదకర బైక్ స్టంట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వింత ప్రయత్నాలు చేసి ఇతరులను ఆందోళనకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే.
మీరు ``మంజుమ్మల్ బాయ్స్`` సినిమా చూశారా? ఆ సినిమాలో ఓ వ్యక్తి కొడైకెనాల్లోని గుణ కేవ్స్లో చిక్కుకుపోతాడు. అతడిని కాపాడేందుకు అతడి స్నేహితులు, రెస్క్యూ టీమ్ ఎన్నో ఇబ్బందులు పడతారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువతికి కూడా తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది.
కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు చుక్కలు చూపించాడు. అతడిని తన కారు బ్యానెట్‌పై ఎక్కించుకొని కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లాడు. శివమొగ్గలోని సహ్యాద్రి కళాశాల సమీపంలో సాధారణ వాహన తనిఖీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే. రూ.500 లంచం ఇవ్వలేదని ఓ పోస్ట్‌మ్యాన్ అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. పాస్‌పోర్ట్‌లోని అతి ముఖ్యమైన పేజీని చింపేశాడు. ఆ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చదువు చెప్పే గురువులను, వైద్యం చేసే డాక్టర్లను దేవుళ్లతో సమానంగా భావించాలి. అయితే దురదృష్టవశాత్తూ మనదేశంలో ఆ వృత్తులే అత్యధిక సంపాదనా మార్గాలుగా నిలుస్తున్నాయి. పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకుని లక్షల్లో ఫీజులు కడుతున్న వారు ఎందరో ఉన్నారు.