Home » Visaka
నారా లోకేష్ శుక్రవారం విశాఖలో కోర్టుకు హాజరుకానున్నారు. ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకున్న ఆయన పార్టీ కార్యాలయంలో బస చేశారు. ‘చినబాబు చిరుతిండి..25 లక్షలండి’ పేరుతో సాక్షిలో అసత్య కథనంపై లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.
అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మంగళవారం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. రోజువారీ కార్యకలాపాలకు కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడింది. జీతాలు సైతం సగమే చెల్లిస్తు న్నారు. రోజుకు 21 వేల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాల్సిన ప్లాంటులో ఇప్పుడు 4వేల టన్నులకు మించి ఉత్పత్తి జరగడం లేదు.
పారిశ్రామిక దిగ్గజం రతన్‌టాటా ఆరేళ్ల క్రితం విశాఖపట్నాన్ని సందర్శించారు. ఏయూ పూర్వ విద్యార్థుల కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. అలాంటి వేళ.. 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో రాజధానిగా అమరావతి నిర్మాణం, ఆంధ్రుల జీవ నాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు.
మంత్రి నారా లోకేశ్ కాన్వాయ్‌లోని ఓ కారు ప్రమాదవశాత్తూ మరో కారును ఢీకొట్టింది. దీంతో రెండు కార్లూ స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇద్దరి వాహనాల డ్రైవర్లకు ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
భీమిలి పట్టణానికి చెందిన ఓ బాలుడు గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో బాలిక వెంటపడ్డాడు. ఆమె తిరస్కరించినప్పటికీ రోజూ వెంటపడేవారు. అయితే ఇదే క్రమంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించి అత్యాచారం చేశాడు.
కూటమి పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలమా లేక వ్యతిరేకమా? చెప్పాలంటూ మాజీ మంత్రి బొత్స ప్రశ్నించారు. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం రైతులు వేలాది ఎకరాలు ఇచ్చారని, ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి దాన్ని సంపాదించుకున్నట్లు బొత్స చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్.. మూడు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా నేడు ఆయన విశాఖపట్నం చేరుకోనున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం తొలిసారిగా మంత్రి నారా లోకేశ్.. జిల్లాకు రానుండడంతో పార్టీ శ్రేణులు ఆయనకు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.
గంగవరం పోర్టు(Gangavaram Port)లోకి భారీ కొండచిలువ(Python) ఎంట్రీ ఇచ్చింది. దాన్ని చూసిన కార్మికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ సురక్షితంగా పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.