Home » Visaka
విశాఖ: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా.. ఎవరు తమ వద్దకు వచ్చినా.. తాము ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతామని, దూరమైనా పరవాలేదని, సంపాదించుకోవాలి, దాచుకోవాలనేది కాదని విశాఖ శారద పీఠం స్వరూపానందేంద్రస్వామి అన్నారు. సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..
సినీ గేయ రచయిత, కళాప్రపూర్ణ డా.జాలాది రాజారావు సతీమణి ఆఘ్నేశమ్మ (82) అనారోగ్యంతో ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం సాయంత్రం కన్నుమూశారు.
అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ పేరుతో విశాఖ కేంద్రంగా భూముల కుంభకోణంపై పత్రికల్లో పెద్ద ఎత్తున వస్తున్న వార్తా కథనాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు.
బినామీల పేరిట వందల ఎకరాల అసైన్డ్ భూములు సొంతం చేసుకున్నా రంటూ సీఎస్ జవహర్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర దుమారమే రేపాయి. ఈ భూ కుంభకోణంపై రోజుకో వ్యవహారం వెలుగుచూస్తూనే ఉంది. అయినప్పటికీ.. ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.
విశాఖపట్నం: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ తీవ్రస్థాయిలో విమర్ళలు గుప్పించారు. పవర్ ప్రాజెక్టులపేరుతో భూ సంతర్పణ చేశారని.. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోలార్ సంస్ధలకు భారీఎత్తున భూములు కట్టబెట్టారని ఆరోపించారు.
విశాఖ: ఈనెల13 న జరిగిన పోలింగ్ సరళి చూస్తే... ఓటర్లు కూటమికే పట్టం కట్టారని.. సంక్రాంతి పండగను తలపించే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి ఓట్లు వేసారని మాజీ మంత్రి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు.
విశాఖ: వైసీపీ గూండాలకు రోజులు దగ్గర పడ్డాయని, కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసిన వారిపై దాడులు చేస్తారా? ఫ్యామిలీ ఇష్యూ అంటూ పోలీసులు కేసును డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజక వర్గం కూటమి అభ్యర్ధి విష్టుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ: తూర్పు నియోజకవర్గం ప్రజలకు తాను ఎంతో చేశానని కూటమి అభ్యర్థి, టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. తాను చేయగలిగినంత సహాయం చేస్తానని.. మాటలతో మోసం చేయడం తెలియదని అన్నారు. గతంలో ఎలా ఉన్నా.. రేపు కూడా అలానే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
ఎంపీగా గెలిచి... పార్లమెంట్లో తాను అడుగు పెడితే విశాఖపట్నం నగరాభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ స్పష్టం చేశారు. ఆదివారం విశాఖపట్నంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు.. తనను ఎంపీగా కోరుకుంటున్నారన్నారు.
విశాఖ: గాజువాక సభలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుపై రాళ్ల దాడి వెనుక వైసీపీ హస్తం ఉన్నట్లు అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం రాత్రి సిఎం జగన్‌పై గులక రాయి దాడికి నిరసనగా.. చంద్రబాబుపై దాడి చేస్తామని వైసీపీ అభిమాని చక్రి ధర్మపురి ముందే చేసిన హెచ్చరిక వాట్సాప్ గ్రూపులో హల్ చల్ చేసింది.