Home » Visakhapatnam
దేశ ప్రజలకు వాతావరణంపై ఎప్పటికప్పుడు సమాచారం, విపత్తుల హెచ్చరికలు అందించేందుకు సొంత మోడలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అమెరికా వాతావరణ సంస్థ నోవా (నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్) మోడలింగ్ డేటా విభాగాధిపతి డాక్టర్ తల్లాప్రగడ విజయ్ అభిప్రాయపడ్డారు.
Andhrapradesh: వైసీపీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈ ఐదు సంవత్సరాలు గాడిదలు కాసారా అంటూ విరుచుకుపడ్డారు. తాము వచ్చిన మూడు నెలలోనే మాంగనీస్ గనులు కేటాయించామని తెలిపారు.
కూటమి పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలమా లేక వ్యతిరేకమా? చెప్పాలంటూ మాజీ మంత్రి బొత్స ప్రశ్నించారు. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం రైతులు వేలాది ఎకరాలు ఇచ్చారని, ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి దాన్ని సంపాదించుకున్నట్లు బొత్స చెప్పుకొచ్చారు.
బంగ్లాదేశ్ ఈశాన్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుంది.
పది రోజుల వ్యవధిలో విజయవాడను, ఆ వెంటనే గోదావరిజిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఇటువంటి విపత్తులు ఏటా రాష్ట్రంలో సంభవిస్తున్నాయి.
Andhrapradesh: అరకులోయ మహిళా డిగ్రీ కళాశాలలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. గత కొంతకాలంగా విద్యార్థుల దగ్గర నుంచి కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, స్టోర్ కీపర్ ప్రతిదానికి డబ్బులు వసూలు చేస్తున్నారు. టీసీల కోసం ఫీజు, సెమిస్టర్ పాసైన సర్టిఫికెట్ కోసం ఫీజు, ఫ్రీ అడ్మిషన్లకు కూడా 9800 చొప్పున ప్రతి డిగ్రీ ప్రొవిజనల్ కోసం రూ.200 ఇలా ప్రతిదానికి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాడు.
విశాఖ ఉక్కు పరిశ్ర మను పరిరక్షించుకుంద్దాం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఏఐటీయూ సీ, వ్యవసాయ కార్మిక సం ఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ను వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఒకటి రెండు గంటలు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత నాన్ స్టాప్గా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాల థాటికి విజయవాడ విల విల్లాడుతున్న సంగతి తెలిసిందే..
Andhrapradesh: భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడిక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అరకులోయ ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రా గుహలను మూసివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా బొర్రా గుహాల పర్యాటక కేంద్రాన్ని మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Andhrapradesh: ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బయటకు వెళ్లాలన్నా వరద నీటితో ఆటంకాలే. చివరకు అంతిమ యాత్రకు కూడా వరద కష్టాలు ఎదురయ్యాయి.