Home » Vivek Venkataswamy
డిసెంబరు 1న తాము నిర్వహిస్తున్న ‘మాలల సింహగర్జన’ సభ ఎవరికీ వ్యతిరేకం కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
సింగరేణి కార్మికులకు అండగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ( CM Revanth Reddy ) ఉన్నారని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి ( MLA Vivek Venkata Swamy ) తెలిపారు. ఆదివారం నాడు మందమర్రి INTUC కార్యాలయంలో కార్మిక సంఘం ముఖ్య నాయకులతో గుర్తింపు సంఘం ఎన్నికలపై సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు గారు,INTUC అధ్యక్షుడు జనక్ ప్రసాద్ ఉన్నారు.
ఈడీపై లీగల్గా ఫైట్ చేస్తానని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ( Vivek Venkataswamy ) వ్యాఖ్యానించారు.
Telangana Elections: మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి.
మంచిర్యాలలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోసం భారీగా నగదు బదిలీ అయిందన్న సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థల ఖాతాల్లోకి రూ.8కోట్ల నగదు బదిలీ జరిగింది. గుర్తు తెలియని ఖాతా నుంచి నగదు బదిలీపై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వివేక్ వెంకట స్వామి(Vivek Venkataswami)కి రూ.కోటి అప్పు ఉన్నారు. వెంకటస్వామి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోనే ఈ విషయం బయటపడింది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections) ముందు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్లు ఆశించి, పార్టీ్ల్లో అసంతృప్తిగా ఉన్న నేతలంతా వేరే పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్లోకి (Congress).. కాంగ్రెస్ నుంచి కారెక్కడం.. కమలం (BJP) కండువా తీసేసి హస్తం గూటికి చేరడం ఇవన్నీ చకచకా జరిగిపోతున్నాయి...
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ను గద్దె దించాలంటే అంతా కలిసికట్టుగా పనిచేయాలని వివేక్ వెంకటస్వామిని కోరడం జరిగిందని, గాంధీ కుటుంబంతో వివేక్కు ఎంతో అనుబంధం ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
అవును.. అంతా అనుకున్నట్లే జరిగింది.. ఎన్నికల ముందు.. అది కూడా అభ్యర్థుల ప్రకటన ముందు కమలం పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. బుధవారం ఉదయం కాషాయ పార్టీకి రాజీనామా చేశారు..