Home » Wayanad
కేరళలోని వయనాడ్‌లో(Wayanad landslide) కొండచరియలు విరిగిపడిన తరువాత, సాయుధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్, ప్రభుత్వ యంత్రాంగంతో కూడిన ప్రధాన రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది.
దేవభూమి కేరళపై ప్రకృతి ప్రకోపించింది. వయనాడు జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. తర్వాత భారీ వర్షం కూడా కురిసింది. ఆ ప్రభావం కొన్ని గ్రామాలపై పడింది. 350 మందికి పైగా చనిపోగా, వందల సంఖ్యలో గాయపడ్డారు. ఆ క్రమంలో అటవీ అధికారులు చేపట్టిన సహాయక చర్యలను యావత్ దేశం ప్రశంసిస్తోంది. వారు నిజంగా హీరోలు అని కేరళ సీఎం పినరయి విజయన్ కొనియాడారు. ఫారెస్ట్ అధికారులను సోషల్ మీడియా ఆకాశానికి ఎత్తేసింది.