Home » Weather
ఏపీలో ఈనెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.
వాతావరణంలో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ప్రస్తుత చలికాలంలో విపరీతమైన చలిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలిబారినుంచి రక్షించుకునేందుకు ప్రజలు నూలు వస్ర్తాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉన్ని దుస్తుల అమ్మకాలు జోరందుకున్నాయి.
మొన్నటి వరకూ తీవ్ర మోంథా తుఫాన్ ప్రభావంతో తల్లడిల్లిన తెలుగురాష్ట్రాల వాసులకు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు విపత్తు నిర్వహణ సంస్థ..
చలి తీవ్రతకు బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. అంత స్థాయిలో చలి తీవ్రత పెరిగిపోయింది. భాగ్యనగరంలోనే కాదు, యావత్ తెలంగాణ వ్యాప్తంగా చలిగాలుల తీవ్రతకు జనం గజగజలాడుతున్నారు.
గ్రేటర్‌లో చలితీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 5 గంటల నుంచే శీతల గాలులు వీస్తుండడంతో వాహనదారులు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఉష్ణోగ్రతలు క్రమేపీ పడిపోతుండడంతో ఇళ్లలోని ప్రజలూ వణికిపోతున్నారు.
చలికాలం తన ప్రతాపాన్ని చూపడం మొదలుపెట్టింది. రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు వస్తున్నాయి. ఈ రాత్రి ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్ కు పడిపోనున్నాయని..
వాతావరణంలో నెలకొన్న పరిస్థితులతో ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్జైన్ తెలిపారు. కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించారు.
భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం దంచికొడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
మొంథా తుఫాను వల్ల జరిగిన ప్రాథమిక నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు.