Home » West Bengal
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ కలకలం రేపింది. ఇంటి వాచ్‌మన్ తన స్నేహితుడితో కలసి దొంగతనానికి పాల్పడి పారిపోగా.. పశ్చిమ బెంగాల్లో వారిని పట్టుకున్నారు.
కోల్‌కతా వారసత్వ ప్రతీకగా పేరొందిన ‘ట్రాము’ సర్వీసులను నిలిపివేయాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది.
పశ్చిమబెంగాల్లోని జల్పాయ్గురి జిల్లాలో ఖాళీగా వెళ్తున్న గూడ్సురైలుకు చెందిన ఐదు బోగీలు మంగళవారం ఉదయం పట్టాల తప్పిన నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్‌పై మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు.
డ్యామ్‌ల నుంచి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) నీరు విడుదల చేయడంతో పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాలకు వరద పోటెత్తింది. దీంతో ఆయా జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
జార్ఖండ్‌కు నీరు వదిలే క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని పలు జల్లాలను వరద నీరు ముంచెత్తడంతో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) వ్యవహారించిన తీరుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. జార్ఖండ్‌ను రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఈ విధంగా వ్యవహరించడం వల్లే వరద నీరు రాష్ట్రానికి పోటెత్తిందన్నారు.
2021 నుంచి ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని హత్యాచారానికి గురైన ఆ కాలేజీ వైద్యురాలి తండ్రి వెల్లడించారు. ఆ నాడే ప్రొ. సందీప్ ఘోష్‌పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కఠిన చర్యలు తీసుకుని ఉంటే.. ఈ రోజు తమ కుమార్తె బతికి ఉండేదన్నారు.
ఆర్జీకర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం కేసులో 'ఆర్థిక అవకతవకల' కోణం నుంచి సీబీఐ విచారణ కొనసాగుతోంది. మాజీ ప్రిన్సిపల్‌పై జరిపిన పాలిగ్రాఫ్ టెస్టుపై సీబీఐ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఆర్జీ కర్ ఆర్జీ కర్ జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతూ జూనియర్ వైద్యులు ఆరోగ్య శాఖ ప్రధానకార్యాలయమైన 'స్వాస్థ్వ భవన్' ఎదుట జరుపుతున్న బైఠాయింపు నిరసనలు సోమవారంతో 8వ రోజుకు చేరుకున్నాయి.
పశ్చిమబెంగాల్లో వైద్య విద్యలో భారీ కుంభకోణం జరిగినట్లు స్థానిక మీడియా ఆరోపించింది. పలువురు వైద్యులతో కూడిన ఈ శక్తిమంతమైన లాబీ.. వైద్య విద్యార్థులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంటర్న్‌ల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిపింది.
జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్న స్వాస్థ భవన్‌కు వెళ్లిన మమతా బెనర్జీ తన ప్రసంగంలో ఎక్కువ సేపు తన గురించే ప్రస్తావించుకున్నారని, ఆమె గురించి కొంచెం ఎక్కువుగా చెప్పుకున్నారంటూ ఎద్దెవా చేశారు. మమతా బెనర్జీ వ్యక్తిత్వానికి..