Home » West Bengal
బ్లాచ్మాన్ వీధి ప్రవేశమార్గం వద్ద ఒక ప్లాస్టిక్ గోనెసంచీని కనుగొన్నట్టు స్టేషన్ ఇన్చార్జి ఆఫీసర్ తెలిపారు. నిరసనలతో అట్టుడికిన ఆర్జే కర్ మెడికల్ ఆసుపత్రి వద్ద ఎవరికీ చెందని బ్యాగు ఒకటి కలకలం సృష్టించిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది.
జూనియర్ వైద్యులు ప్రధానంగా 5 డిమాండ్లపై పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో మెరుగైన వైద్యసేవల కోసం తమ పని పరిస్థితులను మెరుగుపరచాలని, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద భద్రతను పెంచాలని, హత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలని, ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటనతో సంబంధం ఉన్న ఉన్నతాధికారులను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
'స్వాస్థ్య భవన్' ఎదుట నిరసన తెలుపుతున్న జూనియర్ వైద్యులపై దాడి జరిపేందుకు కుట్ర జరుగుతోందంటూ తృణమూల్ కాంగ్రెస్ నేత కునాల్ ఘోష్ సంచలన ఆరోపణ చేశారు.
జూనియర్ వైద్యులతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేరుగా మాట్లాడి, వారిని విధుల్లోకి చేరాలని కోరారు. ముఖ్యమంత్రిగా తాను ఇక్కడకు రాలేదని, ఒక సోదరిగా వచ్చానని చెప్పారు.
సీల్దా కోర్టులో శుక్రవారం జరిగిన క్లోజ్డ్ డోర్ హియరింగ్‌లో నార్కో టెస్ట్‌కు ఏదైనా అభ్యంతరం ఉందా అని జడ్జి నేరుగా రాయ్‌ని అడిగారు. అయితే తన సమ్మతిని తెలిపేందుకు రాయ్ నిరాకరించాడు.
నేర తీవ్రత, దానిని కప్పిపుచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, పని ప్రాంతాల్లో భయాలు నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో యావద్దేశం నిష్పాక్షికమైన సత్వర విచారణను కోరుతోందని వైద్యులు తమ లేఖలో రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు.
ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) స్పష్టం చేశారు.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ప్రాంగణంలో గురువారం ఓ బ్యాగ్ కలకలం సృష్టించింది. సదరు బ్యాగ్‌ను ఎవరు తీసుకు వెళ్లక పోవడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో జాగిలాలతో సహా పోలీసులు ఆర్ జీ కర్ ఆసుపత్రికి చేరుకున్నారు.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్ నివాసంతోపాటు మరో రెండు ప్రదేశాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం సోదాలు నిర్వహించింది. ప్రొ. సందీప్ ఘోష్‌కు చెందిన రెండు ప్లాట్లలో ఈడీ తనిఖీలు చేపట్టింది.
ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటనపై జూనియర్ డాక్టర్ల నిరసనతో తలెత్తిన ప్రతిష్ఠంభన 33వ రోజైన బుధవారంనాడు కూడా తొలగలేదు. చర్చలకు రావాలంటూ ప్రభుత్వం ఆహ్వానించడాన్ని స్వాగతిస్తూనే మరిన్ని కొత్త డిమాండ్లు తెరపైకి తెచ్చారు.