Home » West Bengal
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ను కించపరిచేలా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేశారనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్లోని కృష్ణనగర్ సమీపంలోని ఫుల్బరీకి చెందిన సుజిత్ హల్దార్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఘటనపై వైద్యులు చేపట్టిన నిరసన బుధవారంతో 33వ రోజుకు చేరుకుంది. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ ఇదే సమయంలో ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు గుర్తించి, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ను అరెస్టు చేసింది.
కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో నిరసనల కంటే దుర్గాపూజ వేడుకలపై దృష్టి పెట్టాలని మమతా ప్రజలకు చేసిన విజ్ఞప్తిపై బాధితురాలి తండ్రి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రయినీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో బాధితురాలికి న్యాయం కోరుతూ నిరసనలకు దిగిన జూనియర్ డాక్టర్లు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ వారు విధుల్లోకి చేరలేదు.
కోల్కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యాచార ఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలు హత్యాచార ఘటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. అవి నేటికి కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిరసనల నుంచి దుర్గా పూజల వైపు దృష్టి మరలించాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రజలకు సీఎం మమతా బెనర్జీ సూచించారు.
దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో విభిన్న రీతుల్లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో గణనాధునికి నైవేద్యంగా పలు రకాలు స్వీట్లు, పిండి పంటలు నిర్వాహాకులు సమర్పిస్తున్నారు. వినాయకుడిని అత్యంత ప్రీతిపాత్రమైన జాబితాలో కుడుము
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలి హత్యాచార ఘటనలో మృతురాలి తల్లిదండ్రులకు పోలీసులు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ వస్తున్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం కోల్కతాలో స్పందించారు. ఈ ఆరోపణలను ఆమె ఖండించారు.
కోల్కతాలో వ్యాపారవేత్త స్వపన్ సాహా నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆదివారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్బంగా 9 కేజీల బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యాచార ఘటనతోపాటు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి.