Home » WTC Final
దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధం కావాలని పిలుపందినప్పుడు చాలా సంతోషించినట్టు సంజూ తెలిపాడు. కానీ ఆ కల చివరి వరకు నెరవేరకపోవడంపై ఈ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు.
బెంగళూరు టెస్టులో ఓటమి ప్రభావంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ పాయింట్లు స్వల్పంగా తగ్గాయి. మొత్తం 9 జట్లు ఉండే ఈ పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండగా.. బెంగళూరు ఓటమి తర్వాత పాయింట్లు 74.24 శాతం నుంచి 68.06 శాతానికి తగ్గాయి. మరి భారత్ ఫైనల్ చేరే అవకాశం ఉందా?
ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. 192 పరుగుల లక్ష్య చేధనలో ఒకానొక దశలో 120 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినప్పటికీ..
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో చేసిన రన్స్ ద్వారా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) చరిత్రలో 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ చరిత్రలో 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో (WTC Final) ఆస్ట్రేలియా చేతిలో భారత్ (India) ఓడిపోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మ రెండు ప్రధాన కారణాలను వెల్లడించారు. బౌలింగ్, రెండో ఇన్నింగ్స్‌లో జట్టు బ్యాటింగ్‌లో రాణించలేదని పేర్కొన్నాడు. 209 పరుగుల తేడాతో టీం ఇండియాపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఐదో రోజు తొలి సెషన్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీం ఇండియా వరుస వికెట్లను కోల్పోయి చేజేతులా విజయాన్ని ఆసీస్‌కు అప్పగించింది. దీంతో టీం ఇండియా చేజిక్కించుకోవాల్సి డబ్ల్యూటీసీ ట్రోపీని ఆస్ట్రేలియాకు అందించింది.
డబ్ల్యూటీసీ ట్రోఫీని ముద్దాడాలనే భారత్ కల మరోసారి చెదిరింది. డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. టీమిండియా 209 పరుగుల ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఐదో రోజు తొలి సెషన్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీం ఇండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. కనీసం పోరాట ప్రయత్నం కూడా చేయకుండానే ఆస్ట్రేలియాకు విజయాన్ని కట్టబెట్టింది. భారత బ్యాట్స్‌మెన్ అద్భుతం ఏమైనా చేస్తారా అని ఎదురుచూసినప్పటికీ ఏమాత్రం పోరాటం కూడా లేకుండా రెండో ఇన్నింగ్స్ 234 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో ఐదో రోజు తొలి సెషన్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీం ఇండియా పీకల్లో కష్టాల్లో పడింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో ఐదో రోజు తొలి సెషన్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీం ఇండియా కొద్ది సేపటి వరకు బాగా రాణించినప్పటికీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో నాలుగో రోజు మూడో సెషన్లో వరుస వికెట్ల రూపంలో భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో నాలుగో రోజు మూడో సెషన్లో భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది.