Home » Yadadri Bhuvanagiri
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్య విమాన రాజగోపురానికి బంగారు తాపడం పనుల కోసం 11.700 కిలోల బంగారాన్ని ఈవో భాస్కర్‌రావు గురువారం స్మార్ట్ క్రియేషన్స్ సంస్థకు చెన్నైలో అప్పగించారు.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం శివారులోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎ్‌స)లో 2025 మార్చి చివరి నాటికి పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తిని ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్-2 ఆయిల్ సింక్రనైజేషన్ పనులు ప్రారంభించిన అధికారులు, సిబ్బంది, కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయలేకపోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి లోపమే కారణమని భట్టి అన్నారు.
Telangana: సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయట పడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న మీద ఓట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు... ఏ ఊర్లో అయినా వంద శాతం రుణమాఫీ అయ్యిందా? ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు’’ అని చెప్పారు.
రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. రైతులు అందరికీ ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి మాట తప్పారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
మతం మారిన వారికి త్వరితగతిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యేలా నకిలీ ధ్రువపత్రాలను తయారు చేసే ముఠా ఆటను యాదాద్రి-భువనగిరి జిల్లా పోలీసులు కట్టించారు.
జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) నుంచి అనుమతులు రాని నాలుగు కొత్త వైద్య కళాశాలలపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పాత ఆచారాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 11 నుంచి కొండపై ఉన్న విష్ణు పుష్కరిణిలో స్నానం చేసేందుకు అనుమతిస్తోంది. ఇందుకోసం దంపతులు, భక్తులకు రూ.500 టికెట్ ధర నిర్ణయించి ఆర్జిత సేవల జాబితాలో చేర్చనుంది.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో రూ.15 వేల కోట్ల దోపిడీ జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులోనూ మెగావాట్‌కు రూ.రెండున్నర కోట్ల చొప్పున అంచనా పెంచి.. మొత్తంగా రూ.రెండున్నర వేల కోట్లు దిగమింగిందెవరో లెక్కతేలాలన్నారు.
ప్రసిద్ధ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆయన ఆదివారం లక్ష్మీనృసింహుడిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.