Home » YCP
శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండల పరిధిలోని పెద్దకోట్ల, దాడితోట గ్రామాల మధ్య జరుగుతున్న అదానీ హైడల్ పవర్ ప్రాజెక్టు పనులను బీజేపీ నాయకులు మూడు రోజుల క్రితం అడ్డుకున్నారు. మంగళవార జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
‘‘దేశంలోనే అతితక్కువ ధరకు సౌర విద్యుత్ యూనిట్ రూ.2.49కే సెకీ నుంచి సౌరవిద్యుత్తు కొనుగోలు చేసి, రాష్ట్రానికి మంచి చేస్తే శాలువా కప్పి సన్మానం చేయాలి కదా! అలా చేయకుండా నా వ్యక్తిత్వం మీద బురద జల్లడమేమిటి?’... అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్మయం, ఆగ్రహం, ఆక్రోశం వ్యక్తం చేశారు. అదానీపై అమెరికాలో పెట్టిన కేసులో తన పేరెక్కడుందని ప్రశ్నించారు.
తనపై కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడిన సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్ పారిపోయే అవకాశాలున్నాయని, ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ చేయాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.
సమోసాల కోసమే గత వైసీపీ ప్రభుత్వం రూ.9 కోట్లు ఖర్చు పెట్టిందని, ఆసలు బాధ్యత అనేది లేకుండా వ్యవహరించిందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడప. ఐదేళ్లు ఆయన అధికారంలో ఉండడంతో ఈ జిల్లా అభివృద్ధిలో పరుగులు పెట్టి ఉంటుందనేది... ఇతర జిల్లా వాసులు భావన..! కానీ.. సొంత జిల్లా అభివృద్ధికి జగన్ చేసింది అంతంతమాత్రమే.
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో అందిన రాచమర్యాదల వ్యవహారంలో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి.
టీడీపీ నాయకులు, వారి కుటుంబసభ్యులు, మహిళా నేతలు, జనసేన, కాంగ్రెస్ నేతలపై అసభ్యకరమైన పోస్టింగులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లను పోలీసులు విచారిస్తున్నారు.
సీఐడీ మాజీ అధికారి ఆర్ విజయపాల్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నరసాపురం మాజీ ఎంపీ, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ హింస కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ విజయపాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ప్రభుత్వంలో ఏదైనా బిల్లు పాస్ అయి చెల్లింపులు జరగాలంటే పరిపాలనాపరమైన అనుమతులు ఉండి తీరాల్సిందే! హెచ్ఓడీ, సచివాలయ శాఖ, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్(బీఆర్వో)లో పేర్కొన్న నిబంధనల ప్రకారం బిల్లుకు ఆమోదం ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టం వల్ల భూములు కబ్జా చేసేవారికి కఠిన శిక్షలు పడతాయని తెలుగుదేశం పార్టీ పేర్కొంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన భూ కబ్జాదారుల దుర్మార్గాలను అడ్డుకోవడానికే కొత్త చట్టం వచ్చిందని ఆ పార్టీ వ్యాఖ్యానించింది.