Home » yoga meditation
సిక్కుల పవిత్ర స్థలం గోల్డెన్ టెంపుల్. గుడి ఆవరణలో ఓ మహిళ యోగా చేసింది. ఫొటోలు, వీడియోలు తీసుకుంది. సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్ లోడ్ చేసింది. తమ పవిత్ర స్థలంలో యోగా చేస్తావా అని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) సీరియస్ అయ్యింది. మహిళ తీరును తప్పుపట్టింది.
యోగాసనాలు వేసేటప్పుడు సూచనలు ఇవ్వడంతో పాటు భంగిమల్లో ఏర్పడే పొరపాట్లను సరిదిద్దేందుకు ఐఐటీ మండీ ఆధ్వర్యంలో ఏఐ ఆధారిత యోగా మ్యాట్‌ను రూపొందించారు.
మనిషి జీవితంలో యోగా ఓ మంచి డాక్టర్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిత్యం యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిజాం కళాశాల మైదానంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
‘ప్రపంచవ్యాప్తంగా యోగా అభ్యాసకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నేను సమావేశమైన ప్రతి దేశాధినేత యోగా ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంపొందించి..
యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఖ్యాతి మన దేశానికి దక్కడం గర్వకారణమని అన్నారు. జిల్లా యువజన శాఖ, ఆయుష్, వివేకానంద యోగా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ...
యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరో గ్యం లభిస్తుందని జిల్లా అదనపు న్యాయాధికారి కంపల్లె శైలజా అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని పలు కళాశాలలు, పాఠశాలల్లో యోగా దినోత్సవాన్ని పరుపుకున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day 2024) ప్రపంచ దేశాలన్నీ ఘనంగా జరుపుకుంటున్నాయి. భారత్‌లో శుక్రవారం ఉదయం నుంచే అనేక ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు యోగాసనాలు వేశారు.
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day 2024) దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) శ్రీనగర్(Srinagar)లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారత సరిహద్దుల్లో మంచుతో ఉన్న ఎత్తైన శిఖరాల మధ్య ఆర్మీ సైనికులు నేడు యోగా డే సందర్భంగా యోగా సాధన చేశారు. అంతేకాదు మంచు మధ్య యోగా చేస్తూ సూర్య నమస్కారాలతో ఫిట్‌గా ఉండాలనే సందేశాన్ని కూడా సైనికులు ప్రజలకు అందించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రతి ఏటా జూన్ 21న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. యోగా ప్రాముఖ్యత, దాని ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే ఈ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుతున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.