Home » yoga meditation
“అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని“ వేడుకగా జరుపుకోవడమనేది ప్రపంచ క్యాలెండర్లో ఒక భాగం. దీని అసలైన ప్రాముఖ్యం మన ఆత్మల లోపల ఉంది. ‘యోగా’ లేక ‘యోగ్’ అంటే ‘ఈశ్వరుడితో కలయిక ‘అని భావార్థం.
ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 20, 21 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. జూన్ 20న సాయంత్రం 6 గంటలకు శ్రీనగర్‌లోని షేర్-ఐ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (SKICC)లో 'ఎంపవరింగ్ యూత్, ట్రాన్స్ఫార్మింగ్ J&K' కార్యక్రమంలో భాగస్వామి అవుతారు.
ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ అధికారాన్ని అందుకున్నారు. ఆ క్రమంలో త్వరలో జమ్ము కాశ్మీర్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ నేపథ్యంలో శ్రీనగర్‌లోని దాల్ సరస్సు సమీపంలోని షేర్ ఐ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ వేదికగా జరిగే యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనున్నారు.
యోగా చేస్తే శారీరకంగా, మానసికంగా బాగుంటారు. ఇదే విషయాన్ని వైద్యులు చెబుతుంటారు. వయస్సుతో సంబంధం లేకుండా యోగా చేస్తుంటారు. 60 లేదా 70 ఏళ్ల వృద్దులు యోగా చేయడం అంటే కష్టం.. మరి వందేళ్లు దాటితే అసాధ్యం.. స్వామి శివానందకు సాధ్యం అవుతోంది.
. యోగ చేయడం వల్ల శారీరక శ్రమతోపాటు మానసికంగా బాగుంటారని వివరిస్తున్నారు. యోగాలో చాలా ఆసనాలు ఉంటాయి. అందులో తాడాసనానికి ప్రాధాన్యం ఉంది.
ప్రధాని మోదీ జూన్ 20న జమ్మూకశ్మీర్(Jammu & Kashmir) రాష్ట్రం శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day 2024) సందర్భంగా మోదీ ఆ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఓంకారాన్ని పలకడం ద్వారా నాడీ వ్యవస్థ ప్రేరేపితమై, సాంత్వన దక్కుతుంది. ఇలా ఓంను పలకడం వల్ల శ్వాస క్రమబద్ధమై, రక్తపోటు కూడా తగ్గుతుంది.
వేగంగా మారుతున్న ప్రపంచం, మారుతున్న జీవన విధానంతో పాటు, ఉద్యోగాల సరళి కూడా మారిపోతోంది. ఎక్కువగా కంప్యూటర్ తెర ముందు గంటల పాటు కదలకుండా కుర్చీలో కూర్చొని చేసే ఉద్యోగాలే కనిపిస్తున్నాయి.
ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు ఉరుకులు పరుగులతో రోజు గడుస్తుంది. ఇంటి పనులు, ఉద్యోగాలు, పిల్లల సంరక్షణ, ఇతర కార్యకలాపాలు.. ఇలా ప్రతి పనిని చక్కబెట్టడానికి శరీరంలో తగినంత శక్తి అవసరం. కానీ కొందరికి రోజంతా ఎనర్జీతో ఉత్సాహంగా ఉండటం సాధ్యం కాదు.