Home » Yogi Adityanath
అయోధ్య పురవీధుల్లో లక్షలాది జనవాహిన మధ్య రామలక్షణ వేషధారులు రథంపై ఊరేగగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా రథం లాగి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. లేజర్ షోలు, డ్రోన్ షోలు, రామాయణ ఘట్టాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో అయోధ్య మారుమోగింది.
దీపావళి పండుగ సందర్భంగా అదనంగా మరోరోజు సెలవు పొడిగించడంతో ప్రభుత్వ కార్యాలయాలు, సెకండరీ స్కూళ్లన్నీ నవంబర్ 1న మూతపడతాయి. ఈ ఏడాది దీపావళి వేడుకలు అక్టోబర్ 31వ తేదీన మొదలై నవంబర్ 1వ తేదీ సాయంత్రం వరకూ కొనసాగుతాయి.
ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్లో దుర్గా విగ్రహ నిమజ్జన ఉరేగింపులో ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒక యువకుడు మృతి చెందడంతో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్యానాలోని ఫరీదాబాద్లో శనివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇటీవల తాను జమ్మూకశ్మీర్లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ఎదురైన ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని చెప్పారు.
ఆహారంలో కల్తీ ఘటనలపై అత్యున్నత స్థాయి సమావేశాన్ని యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేశారు. అన్ని హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు సహా ఆహార విక్రయశాలలపై తక్షణమే సమగ్ర తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాలను పెంచేందుకు కఠినమైన ఆదేశాలను జారీ చేశారు.
ఉత్తరప్రదేశ్లో బహరాయిచ్ జిల్లాలో మనుషులపై తోడేళ్లు దాడి ఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి బహరాయిచ్ సబ్ డివిజన్ పరిధిలో డాబాపై నిద్రిస్తున్న అర్మణ్ అలీ(13)పై తోడేలు దాడి చేసింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డారు.
జ్ఞాన్వాపి అనేది మసీదు కాదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్(Yogi Adityanath) సంచలన వ్యాఖ్యలు చేశారు. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదును ముస్లింల ప్రార్థనా స్థలంగా పిలవడంపై యోగీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఒక దొంగ చనిపోవడంతో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎంతో బాధపడుతున్నారని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. డకాయిట్లను పెంచి పోషించే పార్టీ ఎస్పీ అని విమర్శించారు.
ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ల వివాదం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. తొలుత ఈ మాటల యుద్ధానికి అఖిలేష్ తెరతీయగా, దేనికైనా దమ్ముండాలంటూ యోగి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ప్రజలంతా కలిసికట్టుగా ఉన్నప్పుడే దేశ సాధికారత సాధ్యమని, విడిపోతే జరిగేది వినాశనమేనని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. కొన్ని వారాలుగా హింసాత్మక నిరసనలు అట్టుడకడంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బలవంతంగా దేశం విడిచిపెట్టిన వెళ్లిన ఘటనను ఉటంకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.