Home » YS Jagan Manifesto
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. పట్టుమని పదిరోజులు కూడా పోలింగ్ లేకపోవడంతో.. ఇక చివరిగా అస్త్రాలు సంధించడానికి అధికార, ప్రతిపక్షాలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీ గురించి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటికొచ్చింది. అదేమిటంటే..
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై రాష్ట్ర ప్రజలు, సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు.. జగన్ వీరాభిమానులు స్పందిస్తున్నారు. వారి రియాక్షన్ చూస్తే...
పరిపాలనా రాజధానిపై జగన్నాటకం ఉత్తరాంధ్ర ప్రజల చెవిలో వైసీపీ పూలు ‘అమరావతి’ని నాశనం చేసి మూడుముక్కలాట
రాష్ట్ర ప్రజలకు తామిచ్చిన సూపర్ సిక్స్ హామీల ముందు సీఎం జగన్ మేనిఫెస్టో తేలిపోయిందని టీడీపీ వ్యాఖ్యానించింది...
అడ్డగోలు అబద్ధాలు, లేనిపోని గొప్పలు, అసత్యాలతో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేశారు.ప్రజలను మరోసారి మభ్యపెట్టడమే లక్ష్యంగా రూపకల్పన చేశారు. ఐదేళ్ల క్రితం వైసీపీ మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చి, ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక పలు కీలక హామీలను విస్మరించారు.
సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం 2 పేజీల్లోనే 9 హామీలను పొందుపరిచారు. అయితే ఎన్నికల మేనిఫెస్టోనే తమకు ఖరాన్, బైబిల్, భగవద్గీత అంటూ వైసీపీ అధినేత వైయస్ జగన్ వివిధ వేదికల మీద పలుమార్లు ప్రకటించిన విషయం విధితమే. మరి గత ఎన్నికల వేళ... అంటే 2019లో ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ తాము అధికారంలోకి వస్తే.. ఇవి చేస్తామంటూ పలు హామీలతో మేనిఫెస్టో పొందుపరిచారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకుగాను (AP Elections) నామినేషన్ల పర్వం ముగియడంతో.. గెలుపోటములను నిర్ణయించే మేనిఫెస్టో రిలీజ్ చేసే పనిలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. అదిగో మేనిఫెస్టో.. ఇదిగో మేనిఫెస్టో (YSRCP Manifesto) అంటూ కొద్దిరోజులుగా హడావుడి చేసిన వైసీపీ (YSR Congress) ఎట్టకేలకు శనివారం (ఏప్రిల్-27న) రిలీజ్ చేసింది.
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మేనిఫెస్టో-2024ను (YSRCP Manifesto) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టోను కాస్త నిశితంగా పరిశీలిస్తే.. ఇదేంట్రా బాబోయ్ అని తప్పకుండా మీకూ అనిపిస్తుంది. ఇంతకీ జగన్ రిలీజ్ చేసిన 2024 మేనిఫెస్టోకు.. 2019 మేనిఫెస్టోకు ఉన్న తేడాలేంటి..? అని బేరీజు చేసే పనిలో జనాలు, వైసీపీ కార్యకర్తలు నిమగ్నమయ్యారు..
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న 2024 సార్వత్రిక ఎన్నికలకు గాను వైసీపీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. క్యాంప్ కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 2019 ఎన్నికల్లో ఏమేం హామీలు ఇచ్చారు..? ఎంతవరకూ అమలు చేశారు..? ఇలా అన్ని విషయాలను నిశితంగా వివరించిన తర్వాత 2024 మేనిఫెస్టోను జగన్ రిలీజ్ చేశారు. గతంలో లాగే ఈసారి కూడా 2 పేజీలతోనే మేనిఫెస్టోను జగన్ రిలీజ్ చేయడం జరిగింది..