Home » YS Jagan Mohan Reddy
బెల్లం ఉన్న దగ్గరే ఈగలు వాలతాయనే సామెత అందరికీ తెలిసిందే.. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్‌కు ఈ సామెత సరిగ్గా సరిపోతుందనే చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపాధి హామీ నిధులు రూ.250కోట్లు, నీరు- చెట్టు కింద రూ.45కోట్లు విడుదల చేసినందుకు ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ బాలోత్సవ భవన్లో ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆయన నిర్వహించారు.
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికు ట్రోలింగ్ దెబ్బ గట్టిగానే పడుతోంది. మాజీ సీఎం సోషల్ మీడియా పోస్టులను నెటిజన్లు వెంటాడుతున్నపరిస్థితి. ప్రతిపక్షంలోకి వచ్చాక జగన్ పెడుతున్న పోస్టులపై ట్విట్టర్లో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. చివరకు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిపై జగన్ చేసిన ట్వీట్‌పైనా తూర్పారపడుతూ ప్రశ్నలతో ట్వీట్లు హోరెత్తిస్తున్నారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారా.. కాంగ్రెస్ (Congress) పార్టీ ముందుకొచ్చి అడిగితే జట్టు కట్టేందుకు రెడీ అతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి షర్మిల తన సొంత అన్న అని చూడకకుండా జగన్‌పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఏపీసీసీ చీఫ్ హోదా చేపట్టాక.. తన మాటలకు మరింత పదును పెట్టారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై సొంత అన్నపైనే షర్మిల ఎదురుదాడికి దిగారు.
అబద్దాలు చెప్పడంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో (YS Jagan Mohan Reddy) పోల్చుకుంటే గోబెల్స్ కూడా సరిపోడని మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) విమర్శించారు.
‘దమ్ముంటే అసెంబ్లీ కి రా.. ప్రతి విషయంపై అసెంబ్లీలో చర్చ పెడదాం’ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. ఏపీ సీఎం నారా చద్రబాబు నాయడు (AP CM Nara Chadrababu Naidu) సవాల్ విసిరారు. రాజకీయ కక్షసాధింపు తనకు ఇష్టం ఉండదని అయితే హత్యలు చేసి తప్పించుకుంటామంటే ఊరుకోమని చట్ట ప్రకారం శిక్షించి తీరుతామని సీఎం హెచ్చరించారు.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ చివరి రోజు కావటంతో విద్య, ఐటీ శాఖమంత్రి నారా లోకేష్‌కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం నాడు లోకేష్‌ను పలువురు నామినేటెడ్ పదవుల ఆశావహులు కలిశారు. ఈ సందర్భంగా తమ తమ బయోడేటాలు మంత్రికి ఆశావాహులు అందజేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.
వైసీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థపై (Volunteer System) కూటమి ప్రభుత్వంలో కొనసాగుతుందా..? లేదా..? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది...
Andhrapradesh: ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి టీడీపీ సీనియర్ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో యనమల రామకృష్ణుడు, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు విడివిడిగా మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా యనమల.. జగన్‌కు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇండియా కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.