Home » YS Jagan Mohan Reddy
వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ పార్టీకి ఏమీ దొరకటం లేదని.. వారి జీవితమే ఫేక్ అని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలని పునర్విభజించిదని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శలు చేశారు. జగన్ హయాంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకు జిల్లాలు పునర్విభజించిందని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.
బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ జగన్.. తన సొంత ఫోన్ నెంబర్‌ను వెల్లడించలేదని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. లండన్ పర్యటనలో ఉన్న సమయంలో మాజీ సీఎంకు మూడు సార్లు కాల్ చేశామని.. కానీ ఆయన ఇచ్చిన నెంబర్ పనిచేయలేదని సీబీఐ తెలిపింది.
శవ రాజకీయాలు చేయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు బస్సు దుర్ఘటనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ఘటనలో వైసీపీ, బ్లూ మీడియా అనేక తప్పుడు కథనాలు సృష్టిస్తోందని ఫైర్ అయ్యారు ఆలపాటి రాజేంద్రప్రసాద్.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీకి రాకుండా బాలకృష్ణ గురించి మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు.
చంద్రబాబును ఎదుర్కోలేక, అభివృద్ధి పనులు చూసి ఓర్చుకోలేక.. బాలకృష్ణను తాగుబోతు అని జగన్ విమర్శలు చేశారని కోటంరెడ్డి మండిపడ్డారు.
పీపీపీ మోడ్ అంటే అమ్మడం కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ కోటి సంతకాలు చేసుకుంటారా.. లేదా ఐదు కోట్ల సంతకాలు చేసుకుంటారో వారి విచక్షణకే వదిలేస్తున్నామని రఘురామ విమర్శించారు.
విశాఖకు డేటా సెంటర్ రావడం జగన్‌కు ఇష్టం ఉందా లేదా చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు... చంద్రబాబును ఘోరంగా అవమానించారన్నారు.
కల్తీ మద్యం తయారు చేస్తున్నారని వారి కంపెనీని కామెరూన్ ప్రభుత్వ మంత్రి సీజ్ చేసింది నిజం కాదా అని మంత్రి అనగాని నిలదీశారు. వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డిలు జగన్ రెడ్డి బినామీలు కాదా అని అడిగారు.
జగన్ బెదిరింపులకు ఎవరూ తగ్గేది లేదన్నారు మంత్రి సత్యకుమార్. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని.. వైసీపీ వచ్చేది లేది.. చచ్చేది లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.