Home » YS Sharmila
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. వైసీపీ సోషల్ మీడియాను సైతాన్ సైన్యంతో పోల్చారు.
వైసీపీ అధినేత జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల నిప్పులు చెరిగారు. బడ్జెట్ సమావేశానికి కూడా జగన్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపే బాధ్యత జగన్కు లేదా అని నిలదీశారు. అసెంబ్లీకి వెళ్లకుంటే రాజీనామా చేయాలని షర్మిల కోరారు.
Andhrapradesh: ‘‘1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితం అయినా.. కుంగిపోలేదని గుర్తుచేశారు. మీ లెక్క హోదా కావాలని మారం చేయలేదు. 26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డాం. ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది కాంగ్రెస్ పార్టీ’’ అంటూ జగన్పై షర్మిల ఫైర్ అయ్యారు.
జగన్ మాత్రమే కాదు.. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా అసెంబ్లీకి వెళ్లనంటే.. తమ పదవులకు రాజీనామా చేయాలని షర్మిల సవాల్ విసిరారు. సొంత సోదరుడైనప్పటికీ కొంత కాలంగా రాజకీయంగా జగన్, షర్మిల మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జగన్ వ్యాఖ్యలపై షర్మిల ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్నారు. మీడియా సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా అంటూ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ..
సరస్వతి పవర్ షేర్ల బదిలీ అంశం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో చిచ్చుపెట్టిన విషయం తెలిసిందే. తనకు తెలియకుండానే షేర్లు బదిలీ చేశారంటూ తల్లి, చెల్లిపై వైస్ జగన్ వేసిన పిటిషన్పై ఎన్సీఎల్టీ కోర్టులో ఇవాళ (శుక్రవారం) విచారణ జరిగింది.
‘కొంతమంది సైకోలు, సైకో పార్టీలతో కలసి ఉచ్ఛం నీచం లేకుండా సోషల్ మీడియాను భ్రష్టు పట్టించారు. మానవ, రక్త సంబంధాలు మరిచి మృగాల లెక్క మారారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టింగులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వానికి సూచించారు. వైఎస్ భారతీ పీఏ వర్రా రవీందర్ రెడ్డి పై తాను గతంలోనే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ పాలనతోపాటు రాష్ట్రంలోని పలు అంశాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దీనిపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పందించారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ప్రజలు ఏం పాపం చేశారు.. మీకు ఓట్లు వేసి గెలిపించడమే పాపమా’’ అంటూ నిలదీశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని ఆవేదన వ్యక్తం చేశారని... 35వేల కోట్ల భారం మోపారని చంద్రబాబు ఏడ్చినంత పని చేశారన్నారు.
విద్యుత్ ఛార్జీలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఛార్జీలు పెంచొద్దని ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపటినుంచి ఆందోళన చేపడుతామని వైఎస్ షర్మిల ప్రకటించారు.