Home » YS Sharmila
‘తల్లిదండ్రులకు పిల్లలంతా సమానమే! కానీ... ఒక బిడ్డ మరో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం చాలా కష్టం.
YSR Property Issue: వైఎస్ఆర్ ఆస్తుల పంపకం వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ వివాదంపై వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ షర్మిల ఈ అంశంపై పలు దఫాలుగా మాట్లాడగా.. ఇప్పుడు వైఎస్ విజయమ్మ ఎంటరయ్యారు. ఆస్తుల విషయంలో జగన్‌దే తప్పు అని క్లారిటీ ఇస్తూ..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు సంచలన విషయాలను బహిర్గతం చేశారు. ఆస్తుల విషయంలో వైఎస్ షర్మిలకు అన్యాయం జరిగిందని వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు.
జగన్, షర్మిల పేరిట దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొన్ని ఆస్తులు పెట్టారని ఆయన సతీమణి విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికీ ఆస్తులు పంపకం కాదని అన్నారు. వైవీసుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఎన్నో అసత్యాలు చెప్పారని అన్నారు. వైఎస్ ఆస్తులు పంచారన్నది అవాస్తవమని విజయమ్మ స్పష్టం చేశారు.
ఆస్తుల్లో వాటాల పంపిణీకి ఈడీ కేసులు, జప్తు కారణమనే వాదనను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల భర్త అనిల్ కుమార్ తోసిపుచ్చారు.
వైసీపీపై ప్రజలకు నమ్మకం పోయిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబులిటితో వారి సమస్యలపై అనునిత్యం పోరాటాలు చేయాలని, వారిలో భరోసా నింపే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని అన్నారు.
Andhrapradesh: వైఎస్సార్ కుటుంబంలో జరుగుతున్న ఆస్తి తగాదాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ‘‘నాకు ఎంతో బాధ కలుగుతోంది. నాకు వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెట్టారు. వైవీ సుబ్బారెడ్డి, నేను బాగుపడింది వైఎస్ విజయమ్మ వల్ల’’ అని అన్నారు.
అంతర్జాతీయ నేరస్తుడు చార్లెస్ శోభరాజ్‌కు ఏ మాత్రం తీసిపోని జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి నేరమయ జీవితం ముగింపు కూడా అలానే ఉండబోతుందన్నారు. లక్షల కోట్ల ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టినందుకే 16 నెలలు జైల్లో జంటగా చిప్పకూడు తిన్న సంగతి జగన్ రెడ్డి, సాయిరెడ్డి మర్చిపోకూడదని కనపర్తి శ్రీనివాసరావు అన్నారు.
శత్రువులతో చేతులు కలిపి అన్న జగన్‌పై కుట్రలు పన్నడం ఎవరి కోసమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
తన అన్న జగన్మోహన్రెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మళ్లీ విరుచుకుపడ్డారు.