Home » YSRCP Cadre
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు(YS Jagan) గట్టి షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేతలు. ఇప్పటికే పార్టీ ఓటమితో తీవ్ర నైరాశ్యంలో ఉన్న ఆయనకు సొంత పార్టీ నేతల నుంచి ఊహించని తిరస్కరణ ఎదురైంది. సొంత జిల్లాల్లోనే ఆయన చేదు అనుభవం ఎదుర్కొన్నారు. శనివారం కడపకు(Kadapa) వెళ్లిన జగన్కు..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం పాలైన తర్వాత ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 సీట్లకు పరిమితం కావడం.. ఇక 25 ఎంపీ స్థానాల్లో కేవలం 04 స్థానాల్లోనే గెలవడంతో పార్టీకి గడ్డు పరిస్థితులు వచ్చినట్లయ్యింది...
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన వైసీపీ(YSRCP) ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) భేటీ అయ్యారు. 2029లో మళ్లీ వైసీపీనే వస్తుందంటూ వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు జగన్. 2029 వచ్చే నాటికి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తారని అన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బలగమెంత..? మాజీ సీఎంతో ఎంత మంది ఉన్నారు..? ఎన్నికల ముందు.. ఫలితాల తర్వాత వైసీపీ పరిస్థితి ఎలా ఉంది..? ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు..? వైసీపీ (YSR Congress) మళ్లీ పుంజుకునేది ఎప్పుడు..? అసలు అది అయ్యే పనేనా..? ఇలా ఒకటా రెండా వందల సంఖ్యలో ప్రశ్నలు వస్తున్నాయి..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలా కూటమి గెలిచిందో లేదో ఆ మరుక్షణమే సీన్ మొత్తం మారిపోయింది. అప్పటి వరకూ వైసీపీలో ఓ వెలుగు వెలిగి కనీసం ప్రతిపక్ష హోదా లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న పరిస్థితి.
పుంగనూరు రాజకీయాలను 15 ఏళ్లుగా శాసిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఏకచత్రాధిపత్యానికి కళ్లెం పడింది. గతంలో కనుచూపు మేరలో కనిపించని టీడీపీ..
అందరూ ఊహించిన విధంగా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీకి (YSR Congress) కోలుకోలేని స్థితి ఏర్పడింది. రాష్ట్రంలో కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) కూటమి గెలిచిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు, నేతలపై వైసీపీ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) తీవ్రంగా స్పందించారు..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న వైసీపీ.. ఈసారి ఒక్క నంబర్ మిస్సయ్యి 11 సీట్లకే పరిమితం అయ్యింది. దీంతో అసలేం జరిగింది..? ఎందుకింత ఘోర పరాజయం..? అని తెలుసుకునే పనిలో హైకమాండ్ నిమగ్నమైంది..
అధికారం కోల్పోయామనే అక్కసుతో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. ఇంతకాలం సాగిన తమ అరాచకాలు ఇంకా సాగుతాయనుకున్నారో ఏమో గానీ.. తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న టీడీపీ కార్యకర్తలపై అటాక్ చేశారు. టీడీపీ శ్రేణులు ప్రయాణిస్తున్న వాహనాలపై రాళ్లతో దాడి చేశారు వైసీపీ శ్రేణులు.