Home » YSRCP Election Manifesto 2024
అడ్డగోలు అబద్ధాలు, లేనిపోని గొప్పలు, అసత్యాలతో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేశారు.ప్రజలను మరోసారి మభ్యపెట్టడమే లక్ష్యంగా రూపకల్పన చేశారు. ఐదేళ్ల క్రితం వైసీపీ మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చి, ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక పలు కీలక హామీలను విస్మరించారు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోపై మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. పేద వాడి జీవన ప్రమాణాలకు అనుగుణంగా తమ మేనిఫెస్టో ఉందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకుగాను (AP Elections) నామినేషన్ల పర్వం ముగియడంతో.. గెలుపోటములను నిర్ణయించే మేనిఫెస్టో రిలీజ్ చేసే పనిలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. అదిగో మేనిఫెస్టో.. ఇదిగో మేనిఫెస్టో (YSRCP Manifesto) అంటూ కొద్దిరోజులుగా హడావుడి చేసిన వైసీపీ (YSR Congress) ఎట్టకేలకు శనివారం (ఏప్రిల్-27న) రిలీజ్ చేసింది.