టీవీ రిమోట్ అందుకోవాలంటే బద్దకం. స్కూల్‌లో పేరెంట్స్ మీటింగ్‌కు వెళ్లాలంటే వాయిదా. పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకోవాలంటే ఇల్లు కదలరు. ఇలా.. ప్రతీదీ వాయిదా.. వాయిదా.. ఇలాంటి కాలయాపనే కాలయముడై మన విజయాన్ని అంతమొందిస్తుంది. పనులు వాయిదా వేయడమంటే వైఫల్యాన్ని ఆహ్వానించడమే. ఏరోజు చేయాల్సిన పని ఆ రోజు చేయడం కాదు, ఒక రోజు ముందే పూర్తి చేయగలగాలి. అప్పుడే విజయం వరిస్తుంది.
పోలీసు ఉద్యోగంపై మోజుతో ఓ యువతి తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. కానిస్టేబుల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ఆమె చివరకు నకిలీ కానిస్టేబుల్‌గా మారి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.
అమెరికా టెక్ రంగం అభివృద్ధిలో వలసదారుల పాత్ర అద్భుతమని ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు. టెక్ రంగంలో సృజనాత్మకతకు వారు చోదకశక్తిగా ఉన్నారని అన్నారు. టెక్ రంగం చరిత్ర చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.
ఏఐ చెప్పిందల్లా నిజమని భావించొద్దని ఆల్ఫబెట్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. అత్యాధునిక ఏఐ సాంకేతికత కూడా ప్రస్తుతం తప్పులు చేసే అవకాశం ఉందని అన్నారు.
అంతరిక్షం అంటే అదో అద్భుతం. అలాంటి అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్లిన ఓ వ్యోమగామి.. అక్కడి నుంచి ఓ వీడియోను తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఆ వ్యోమగామి ఏం కవర్ చేశారు? వాటి సంగతులేంటి? దానిపై నెటిజన్ల స్పందన ఎలా ఉందో.. ఆ వివరాలు మీకోసం...
ఉద్యోగంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరమని, చిన్న వైద్యమైనా ఖర్చు ఎక్కువగా ఉంటుందని, అది కుటుంబాలకు అదనపు భారంగా మారుతోందని ఎస్పీ జానకి అన్నారు.
భారతీయ ఉద్యోగులు ఏఐ సాధనాలను విశ్వసనీయ వర్క్ పార్ట్‌నర్లుగా చూస్తున్నారని ఓ సర్వేలో తేలింది. ఏకంగా 71 శాతం మంది భారతీయ వర్కర్లు ప్రస్తుతం తమ విధినిర్వహణలో భాగంగా ఏఐని వినియోగిస్తున్నారు.
విండోస్ ఏజెంటిక్ ఓఎస్ వస్తోందంటూ సంస్థ చీఫ్ చేసిన ప్రకటనపై జనాలు మండిపడుతున్నారు. ఓఎస్‌లోని మౌలిక సమస్యలను ముందు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
టాప్ 100 యాప్స్ జాబితాలో అరట్టై యాప్‌కు చోటుదక్కకపోవడంపై జోహో కార్పొరేషన్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు తాజాగా స్పందించారు. ఇది సర్వసాధారణమైన పరిణామమేనని అన్నారు. దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకెళుతున్న తాము స్వల్పకాలిక మార్పులపై పెద్దగా ఆందోళన చెందమని అన్నారు.
మల్టీ టాస్కింగ్ చేసే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మైక్రోసాఫ్ట్ కంపెనీ విండోస్ 11లో అద్భుతమైన ‘స్నాప్ లేఅవుట్స్’ ఫీచర్‌ను యాడ్ చేసింది. మల్టీ టాస్కింగ్ చేసే వారికి స్నాప్ లేవుట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. విండోస్ 11లో ఈ ఫీచర్ ఇన్ బుల్ట్ ఉంటుంది.