ఈ నియోజకవర్గం నాగర్ కర్నూల్ జిల్లాలో ఉంది. 2016లో తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్‌నగర్ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి గువ్వల బాలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,00,056గా ఉంది. తొలుత ఈ నియోజకవర్గం నుంచి 1962లో కాంగ్రెస్ పార్టీ తరఫున కే. నాగన్న గెలుపొందారు. ఆ తర్వాత 1967లో పుట్టపాగ మహేంద్రనాథ్ (కాంగ్రెస్), 1972లో ఆర్ఎమ్ మనోహర్ (కాంగ్రెస్), 1983 & 1985లలో పుట్టపాగ మహేంద్రనాథ్ (టీడీపీ), 1989లో డీ. కిరణ్ కుమార్ (కాంగ్రెస్), 1994 & 1999లలో పీ. రాములు (టీడీపీ), 2004లో డా. వంశీకృష్ణ (కాంగ్రెస్), 2009లో పీ. రాములు (టీడీపీ), 2014 & 2018లలో గువ్వల బాలరాజు (బీఆర్ఎస్) గెలుపొందారు. 2018లో పోటీ ఎవరి మధ్య? 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధ్యర్థి గువ్వల బాలరాజు గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణపై 9,556 ఓట్ల మెజారిటీతో గెలిచారు. గువ్వల బాలరాజుకి 87,841 ఓట్లు (50.11%) ఓట్లు పడగా.. వంశీకృష్ణకు (78,285) ఓట్లు (44.66%) నమోదయ్యాయి. బీజేపీ అభ్యర్థి మేడిపూర్ మల్లికార్జున 3,196 ఓట్లు (1.82%) పడగా.. నోటాకు 2,403 ఓట్లు (1.37%) పడ్డాయి. మొత్తంగా 81.85 పోలింగ్ శాతం నమోదవ్వగా.. గువ్వల బాలరాజు 9,556 ఓట్ల మెజారిటీతో విజయఢంకా మోగించారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |